Cricket Match: ప్రాణం తీసిన క్రికెట్ మ్యాచ్.. సరదాగా మొదలైన గొడవ కాస్త విషాాదాంతం
Cricket Match Fight: దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఆటలకు ఉండవు. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్‌కు ఉన్న వీరాభిమానుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. మరి అలాంటి క్రికెట్ వివాదాలకు కూడా కేంద్రంగా మారుతోంది. తాజాగా ఓ చోట జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సరదాగా మొదలైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసే స్థాయికి చేరింది.
Cricket Match Stoned To Death: గల్లీ క్రికెట్‌లో ఉండే మజానే వేరు. ఆట కన్నా ఎక్కువ గొడవలు, తప్పుడు ఆట ఉండడం మరింత వినోదాన్ని అందిస్తుంది. ఇలా ఓ మ్యాచ్‌లో జరిగిన తప్పు తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆ గొడవ చినికి చినికి గాలివానలాగా మారి ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. మైదానంలో రక్తపాతం పారింది. పరస్పరం ఇరు వర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో గాయాలయ్యాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటచేసుకుంది.
Also Read: Monkey Fever: కర్ణాటకలో 'మంకీ ఫీవర్' కలకలం.. ఇద్దరి మృతితో భయాందోళనలు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా చిపియానా ప్రాంతంలో ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం క్రికెట్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఆడుతున్న సమయంలో చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో 24 ఏళ్ల సుమిత్ కాలువలో పడ్డాడు. దొరికిందే అవకాశంగా భావించిన ముగ్గురు వ్యక్తులు సుమిత్‌పై కాల్వలపై విచక్షణా రహితంగా రాళ్లతో కొట్టారు. పెద్ద పెద్ద బండరాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలతో సుమిత్ అక్కడికక్కడే మరణించాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న బిస్‌రక్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుమిత్ కారు డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు.
Also Read: Chiranjeevi as Hanuman: మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ వేషం వేసిన ఈ సినిమా తెలుసా..
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటనకు గల కారణాలు ఆరా తీశారు. క్రికెట్ మ్యాచ్‌లో గొడవ ఎందుకు జరిగింది? దాడి ఎందుకు చేశారో అనే వివరాలు మ్యాచ్ ఆడిన వారందరినీ అడిగి తెలుసుకున్నారు. గొడవకు దారి తీసిన పరిస్థితులు ఆరా తీశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఘటనకు హిమాన్షు ప్రధాన కారకుడిగా గుర్తించారు. అతడితోపాటు టింకు, అన్షు అనే మరో ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు.
'హిమాన్షుతోపాటు మరో ఇద్దరు ముగ్గురు సుమిత్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకోవడానికి సుమిత్ పరుగెత్తాడు. ఈ క్రమంలో అతడు కాల్వలో కిందపడ్డాడు. అప్పటికీ సుమిత్‌ను వదలలేదు. హిమాన్షుతోపాటు మరికొందరు సుమిత్‌పై విచక్షణ రహితంగా రాళ్లతో దాడి చేశారు. ఎందుకు దాడి చేశారనేది మాత్రం ఇంకా కారణాలు తెలియలేదు' అని సెంట్రల్ నోయిడా అదనపు డీసీపీ హృదేశ్ కఠారియా వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook