Chittoor Accident: ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన రెండు లారీలు.. ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు
Massive Accident in Chittoor: ఏపీఎస్ఆర్టీసీ బస్సును రెండు లారీలు ఢీకొట్టడంతో ఏడుగురు చనిపోగా.. 30 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లాలో సంభవించింది. వివరాలు ఇలా..
Massive Accident in Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు, ఒక బస్సు ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. దాదాపు 30 మందికి గాయలు అయ్యాయి. మొగిలి ఘాటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతులు పెరిగే సంఖ్య ఉందని చెబుతున్నారు. మొగిలి ఘాట్ రోడ్డులో తిరుపతి నుంచి బెంగుళూరుకి వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సును ముందు ఒక లారీ, వెనక మరో లారీ ఢీకొనడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యయి. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Also Read: Sri Vijaya Puram: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చేసిన కేంద్రం.. ఇక నుంచి శ్రీ విజయపురం
మొగలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీనీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం.. సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అని తెలిపారు.
చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సు రెండు లారీలు ఢీకొనడంతో ఇప్పటివరకు పలువురు మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: Viral video: బాబోయ్ ఇంట్లో 100 పాములు.. చివరకు ట్విస్ట్ మామలుగా లేదుగా.. వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.