Hyderabad Girl Kidnapped: రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం జరిగింది. మీర్ పేటలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. బాధిత బాలిక స్నేహితురాలి నివాసానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 9వ తరగతి చదువుతున్న బాలికను మీర్ పేట పీఎస్ పరిధిలోని లెనిన్ నగర్‌లో కిడ్నాప్ చేసిన యువకులు.. మూడు గంటల పాటు బైక్‌పై పలు ప్రాంతాలకు తిప్పారు. రాత్రి 11 గంటల సయమంలో ఖాళీ ప్రాంతంలో తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలిక చేతులు కదలకుండా ఒక నిందితుడు పట్టుకోగా.. మరో నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండో నిందితుడు అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా బాలిక కేకలు వేయడంతో  ఘటనా స్థలికి గుర్తు తెలియని వ్యక్తి అటుగా వచ్చి బాలికను రక్షించాడు. కొన్ని రోజులుగా  బాధిత బాలికను నిందితుల్లోని ఒక యువకుడు వెంబడిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో యువకులపై  అత్యాచారం ,కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు మీర్ పేట పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 


నారాయణగూడలో మరో దారుణం


నారాయణగూడలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మొదటి భర్తతో ఓ మహిళకు కొద్ది రోజులుగా గొడవలు ఉన్నాయి. సోమవారం రాత్రి నారాయణగూడ ఫ్లైఓవర్ కింద రెండో భర్తతో కనిపించడంతో ముగ్గురుపై పెట్రోల్ పోసి మొదటి భర్త నిప్పంటించాడు. కొన్ని సంవత్సరాలుగా మొదటి భర్తకు దూరంగా ఉంటున్న మహిళ.. మరో వివాహం చేసుకుని కొడుకు బాబుతో కలిసి నివసిస్తోంది. కొడుకు, భర్తతో కలిసి ఉండగా.. మొదటి భర్త పెట్రోల్‌తో దాడి చేశాడు. ముగ్గురికి గాయాలు కావడంతో గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. బాబు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: Rohit Sharma: సెమీ ఫైనల్‌కు ముందు రోహిత్ శర్మకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్


Also Read: Chandra Grahan Time: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఈ సమయాల్లో ఆలయాలు మూసివేత


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook