Mobile Phone Charger Dispute: హైదరాబాద్‌లో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. రోజు రోజుకు హత్యలు, దాడులు, అల్లర్లు పెరిగిపోతున్నాయి. గూండాలు, రౌడీలు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే మరో దారుణ హత్య చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌ చార్జర్‌ కోసం మహిళను అత్యంత కిరాతకంగా ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ హత్య ఉదంతం హైదరాబాద్‌లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Akbaruddin Owaisi: బుల్లెట్లతో నన్ను కాల్చండి.. నా కాలేజ్‌ను కాదు: అక్బరుద్దీన్‌ సంచలనం


హైదరాబాద్ శివారు మేడ్చల్‌ జిల్లా దుండిగల్లో శాంత (50) అనే మహిళ బెల్ట్‌షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తుండేది. యథాలాపంగా ఆదివారం కూడా ఆమె తన దుకాణం తెరచి ఉంచారు. ఆదివారం ఆ దుకాణానికి తండా 2కు చెందిన రావుల కమల్‌ కుమార్‌ (37) వచ్చాడు. అతడు తండా సమీపంలోని ఆల్ట్రాక్లీన్‌ సర్వీసెస్‌ కంపెనీలో మెయింటెనెన్స్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తుంటాడు. దుకాణానికి వచ్చి శాంతను మొబైల్‌ చార్జర్‌ అడిగాడు. తన దుకాణానికి చార్జర్‌ అడగడంతో ఆమె విస్తుపోయింది. ఈ క్రమంలో అతడిపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమయంలో శాంతకు, కమల్‌ కుమార్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దూషించుకుంటున్న క్రమంలో కమల్‌ ఆవేశానికి లోనయ్యాడు. క్షణికావేశంలో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అరవకుండా నోరు మూసేసి హత్య చేశాడు.

Also Read: Nagarjuna: నేను ఎలాంటి ఆక్రమణ చేయలేదు: కుండబద్దలు కొట్టిన నాగార్జున


 


అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడే పడేసి కమల్‌ కుమార్‌ పరారయ్యాడు. అయితే స్థానికులు ఆమె మృతదేహం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫుటేజ్‌లో కమల్‌ కుమార్‌ స్పష్టంగా కనిపించడంతో అతడి కోసం గాలించారు.


గాలిస్తున్న క్రమంలో గాగిల్లాపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద కమల్‌ కుమార్‌ పోలీసులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన విషయం మొత్తం వివరించాడు. కొట్లాడుతున్న సమయంలో ఆమె కేకలు వేయడంతో దాడి చేశానని.. ముక్కు నోరు మూయడంతో ఊపిరి ఆడక ఆమె చనిపోయినట్లు పోలీసులకు కమల్‌ కుమార్‌ వివరించాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter