Eluru Crime News: తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి హేయమైన చర్యకు పాల్పడింది. సభ్యసమాజం తలదించుకునేలా దారుణంగా వ్యవహరించింది. వయసు వచ్చిన తన ఇద్దరు కుమార్తెలను రెండో భర్త పరం చేసింది. ఆ ఆడబిడ్డలతో పిల్లలను కనేలా చేసింది. ఊహకందని ఈ ఘోర అమానవీయ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై దిశ పోలీసులు కేసు నమోదు చేసుకుని కసాయి తల్లితోపాటు రెండో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు ఇలా.. 
 
పెదపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త 2007లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పటికే కు.ని. ఆపరేషన్ చేయించుకుంది. ఆ తరువాత మేనత్తక కుమారుడిని రెండో వివాహం చేసుకుంది. కొద్ది రోజులు కాపురం అనంతరం తనకు పిల్లలు కావాలని రెండో భర్త కోరాడు. ఆమె ఆపరేషన్ చేయించుకోవడంతో తాను మరో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇందుకు ఆ మహిళ ఒప్పుకోలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలానే కొన్నేళ్లు సాగిన తరువాత ఆమె కూతుర్లిద్దరూ యుక్తవయసుకు వచ్చారు. అప్పుడే ఆ తల్లిలో దురాలోచన బయటకు వచ్చింది. మరో పెళ్లి చేసుకోవద్దని.. తన కూతుర్లతోనే పిల్లలను కనాలంటూ భర్తకు చెప్పింది. పెద్ద కుమార్తె (17) 2017లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మగ పిల్లాడు కావాలని అనడంతో రెండో కుమార్తెను కూడా భర్త పరం చేసింది. రెండో కుమార్తెకు సంవత్సరం క్రితం మగబిడ్డ పుట్టి చనిపోయాడు. ఆ పసికందు మృతదేహాన్ని కాలువలో పాడేశారు. 


ఇటీవల భర్తతో విభేదాలు రావడంతో తన కుమార్తెలను ఆ గ్రామంలోనే వదిలేసి మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్న కుమార్తె ఈ విషయాన్ని మొత్తం తనకు తెలిసిన ఓ యువకుడికి వివరించింది. ఆ యువకుడు వారి మేనమామకు చెప్పాడు. ఈ విషయం బంధువులందరికీ తెలియడంతో దిశ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దిశ సీఐ ఇంద్రకుమార్‌ తెలిపారు.


Also Read: సెంచరీలతో కదం తొక్కిన యశస్వి, రోహిత్.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా..


Also Read: Chandrayaan 3: మరికొన్ని గంటల్లో నింగిలోకి 'చంద్రయాన్-3'.. అందరి చూపు మనవైపే..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి