Mother Killed Her Minor Son And Daughter: ప్రియుడి మోజులో కన్న పిల్లల్నే కడతేర్చింది ఓ మహిళ. అది కూడా అభం శుభం తెలియని పసి పిల్లలనే దయ, జాలి కూడా లేకుండా వారిని హతమార్చి కాలువలో పడేసింది. ఇంకా దారుణం ఏంటంటే.. కన్నపిల్లల్నే కడతేర్చిన ఆ కసాయి తల్లికి ఆమె ప్రియుడితో పాటు ఇరుగుపొరుగు కూడా సహాయం చేశారు. మాతృత్వానికే మచ్చ తెచ్చిన ఈ దుర్ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరట్ కి చెందిన ఈ మహిళకు 10 ఏళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న ఈ మహిళ స్థానిక కౌన్సిలర్ అయిన సౌద్ అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. అతడితోనే జీవితాన్ని సెటిల్ చేసుకునేందుకు కన్నపిల్లలని అడ్డుగా భావించింది. అదే విషయం ప్రియుడికి చెప్పింది. ప్రియుడి సహాయంతో ఇద్దరు పిల్లలను చంపి కాలువలో పడేసింది. మార్చి 22న ఈ ఘటన జరిగింది.


పిల్లలను చంపిన తరువాత ఏమీ తెలియనట్టే పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న మీరట్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో అసలు నిజం బయటపడింది. 


మీరట్ ఎస్పీ పీయుష్ సింగ్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. తన ఆరేళ్ల కూతురిని తన ఇంట్లోనే మట్టుబెట్టిన కసాయి తల్లి.. 10 ఏళ్ల కొడుకును పక్కింట్లో చంపింది. ఈ నేరంలో మొత్తం ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు పాల్గొన్నారు. పిల్లలను చంపిన అనంతరం సమీపంలోని కాలువలో విసిరేశారు. కాలువలో గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇంకా పిల్లల మృతదేహాలు లభించలేదు అని పీయుష్ సింగ్ మీడియాకు తెలిపారు. ఈ నేరంలో పాల్పంచుకున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు మీరట్ పోలీసులు పేర్కొన్నారు. 


ఇది కూడా చదవండి : ATM Robbery: ఏటీఎం నుంచి సినీ ఫక్కీలో రూ. 5.60 లక్షలు చోరీ.. ఒక్క క్లూ లేదు.. ఎలాగో తెలుసా ?


ఇది కూడా చదవండి : Nikki Yadav Murder Case: తెల్లవారితే పెళ్లి.. గాళ్‌ఫ్రెండ్‌ వెంటపడుతోందని..


ఇది కూడా చదవండి : Crime News : ప్రియురాలి రేప్, ప్రైవేట్ పార్ట్స్‌లో ఐరన్ రాడ్ పెట్టి మరీ మర్డర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK