Young Woman: విదేశాల్లో స్థిరపడిన భర్త.. అంగరంగ వైభవంగా పెళ్లయింది.. చక్కటి ఆశలతో జీవితం మొదలైంది. త్వరలోనే భర్త కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అకస్మాత్తుగా ఆ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లయి ఆరు నెలలు కాకుండానే జీవితాన్ని నాశనం చేసుకుంది. అందరూ నిద్రిస్తుండగా ఇంటి ఆవరణలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లారి లేచి చూసేసరికి కుటుంసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Riyan Parag: చిక్కుల్లో క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌.. హీరోయిన్ల హాట్‌ వీడియోలు వెతుకుతూ రెడ్‌ హ్యాండెడ్‌గా


 


ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లికి చెందిన దావులూరి వర్షిత (24) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తుండేది. ఆమెకు తిరువూరు మండలం ఎరుకుపాడు గ్రామానికి చెందిన యువకుడితో ఈ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన వివాహం జరిగింది. భర్త విదేశాల్లో స్థిరపడ్డాడు. పెళ్లయిన వారం రోజులకే భర్త విదేశాలకు వెళ్లాడు. త్వరలోనే భార్య వర్షితను కూడా తీసుకెళ్తానని చెప్పి వెళ్లాడు. చెప్పినట్టే విదేశాలకు వెళ్లేందుకు వర్షితకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా హర్షిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేది.

Also Read: Mandi Biryani: పెళ్లి రోజు చావుకొచ్చింది.. మండీ బిర్యానీ తిన్న కుటుంబం ఆస్పత్రిపాలు


 


ఈ కారణంతో వర్షితను తండ్రి కిరణ్‌ కుమార్‌ స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌ నుంచి కుమార్తెను ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం  తెల్లవారుజామున వర్షిత నిద్రలేచింది. తల్లిదండ్రులు నిద్రపోతుండడంతో ఆమె ఇంటి ఆవరణలోని బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర లేచి చూసేసరికి వర్షిత కనిపించడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో బావిలో చూడగా ఆమె శవమై తేలి ఉంది. సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు విచారణ చేపట్టగా.. 'అనారోగ్య కారణాలతోనే వర్షిత ఆత్మహత్య చేసుకుంది' అని తండ్రి కిరణ్‌కుమార్‌ తెలిపాడు. జూలైలో భర్త కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండగా అంతలోనే వర్షిత బలవన్మరణానికి పాల్పడడం విషాదం నింపింది. పెళ్లయి ఆరు నెలలు కూడా కాకపోవడంతో వర్షిత ఆత్మహత్యకు పాల్పడడం రెండు కుటుంబాల్లోనూ తీరని లోటు మిగిల్చింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter