Odisha Murder Case Updates: ఒడిశాలో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలిని భార్యతో హత్య చేసిన ప్రియుడు.. 31 ముక్కలుగా నరికి పాతిపెట్టాడు. నబరంగ్‌పూర్ జిల్లాలోని ఉమర్‌కోట్ బ్లాక్ పరిధిలోని మురుమడిహి గ్రామానికి సమీపంలోని అడవిలో తిలాబాతి గోండ్ అనే 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు మృతదేహం కోసం తవ్వగా.. దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు బాఘబెడ గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. శవం త్వరగా కుళ్లిపోవడానికి ఉప్పును కూడా పోశారు. ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తి, తన భార్యతో కలిసి హత్య చేశాడు. నాలుగు రోజుల కిందట చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాఘబెడ గ్రామానికి చెందిన లుదురామ్ గోండ్ అనే వ్యక్తి కుమార్తె తిలాబతి గోండ్‌ (23). ఈ నెల 22న మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు.. పట్టణ ప్రజలు, కుటుంబ సభ్యులు ఆమె కోసం మరుసటి రోజు అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. విచారణలో పోలీసులకు ప్రేమ వ్యవహారం గురించి తెలిసింది. 


బాధితురాలు దాదాపు గత రెండేళ్లుగా వివాహితుడైన చంద్ర రౌత్‌తో ప్రేమాయణం సాగించినట్లు తేలింది. ఆమె నవంబర్ 22న రాత్రి తన ఇంటికి  పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని ఇంటికి వెళ్లి.. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. తనను పెళ్లి చేసుకోవాలని.. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. చంద్ర రౌత్, తన భార్య సియాబతితో  కలిసి ఆమెతో వాగ్వాదానికి దిగారు. చివరకు భార్యాభర్తలిద్దరూ కలిసి.. తిలాబతిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మురుమడిహి అడవిలోకి ఎత్తుకెళ్లారు. అక్కడ 31 ముక్కలుగా నరికి పాతిపెట్టారు. మృతదేహం త్వరంగా కుళ్లిపోవాలని ఉప్పు పోశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. 


ఈ ఘటనను జుగుసాయి అనే వ్యక్తి.. గ్రామస్థులకు చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాం కోసం తవ్వగా.. ముక్కలు ముక్కలు తేలడం చూసి విస్తుపోయారు. ఏకంగా 31 ముక్కలుగా మృతదేహాన్ని నరికినట్లు గుర్తించారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మురుమడిహి గ్రామానికి చెందిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు సమాచారం. ఘటన స్థలంలో ఓ కత్తి స్వాధీనం చేసుకున్నారు. రాయ్‌ఘర్ పోలీసులు సెక్షన్లు 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook