Political Murder: తెలంగాణలో అధికారం మారడంతో రాజకీయ హత్యలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. గతంలో రెండు మూడు హత్యలు జరగ్గా తాజాగా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో మరో రాజకీయ హత్య చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురవడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మరోసారి రాజకీయ వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ హుటాహుటిన కొల్లాపూర్‌కు బయల్దేరారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pune Accident: ఇద్దరిని చంపిన వ్యక్తికి కేవలం 300 పదాల వ్యాసం రాయాలని శిక్ష.. కోర్టు తీర్పు వైరల్‌


 


ఏం జరిగింది?
మొన్నటి వరకు కొల్లాపూర్ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేగా బీరం హర్షవర్ధన్‌ రెడ్డి పని చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో అధికారం కూడా మారింది. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్‌ రెడ్డి అనుచరులే లక్ష్యంగా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయి. రెండు నెలల కిందట గులాబీ కార్యకర్త అయిన ఆర్మీ జవాన్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ హత్య మరువకముందే చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇంటి ముందు ఆరు బయట నిద్రిస్తున్న శ్రీధర్‌ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు.

Also Read: Mother Of Baby: బాల్కానీలో పడిన చిన్నారి.. మీడియాలో ట్రోల్స్‌ భరించలేక తల్లి మృతి


 


తెల్లవారుజామున లేచి చూసిన కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మంచంపై అచేతనంగా పడి ఉన్న శ్రీధర్‌ రెడ్డిని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రాజకీయాల్లో బీరం హర్షవర్ధన్‌ రెడ్డి వెనుక తిరుగుతున్న శ్రీధర్‌ రెడ్డి మరణంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.


హత్య వెనుక జూపల్లి
ఈ హత్యపై మాజీ హర్షవర్ధన్‌ రెడ్డి స్పందించారు. శ్రీధర్ రెడ్డి హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'శ్రీధర్ రెడ్డి హత్య చాలా దారుణం. ఇది ముమ్మాటికి రాజకీయ హత్యనే. శ్రీధర్ రెడ్డి హత్య వెనక మంత్రి జూపల్లి హస్తం ఉంది. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజా ప్రతినిధుల హత్యలు జరుగుతున్నాయి. వారం రోజుల కిందట డీజీపీని కలసి కొల్లాపూర్ నియోజవర్గంలో శాంతి భద్రతలు కాపాడాలని వినతిపత్రం ఇచ్చాం. ఆర్మీ జవాన్ హత్య మరువకముదే శ్రీధర్ రెడ్డి హత్య జరగడం దారుణం. కొల్లాపూర్ నియోజవర్గంలో  జొన్నలబొగుడ, నార్లాపూర్, ముక్కిడిగూడం, చిన్నకర్పముల, కుడికిళ్ల గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter