Rajasthan Crime News: రక్షా బంధన్ రోజున దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బర్త్ డే వేడుకకు పిలిచి ఓ యువతిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా అనే పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. అన్నాచెల్లెల్లు సంతోషంగా గడపాల్సిన సమయంలో యువతిపై నిందితులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలవర పరుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువకుడితో బాధితురాలికి గత కొన్ని నెలలుగా పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో హోటల్ కృష్ణా ప్యాలెస్‌లో తన బర్త్ డే వేడుకల కోసం ఆమెను యువకుడు ఆహ్వానించాడు. అక్కడికి వచ్చిన తరువాత యువకుడితో మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందరూ కలిసి యువతితో బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నలుగురు అత్యారానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో తీవ్రమనోవేదనకు గురైన బాధితురాలు.. వెంటనే తెరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


అయితే పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. చివరికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ యువనేత జోక్యంతో కేసు విచారణ ప్రారంభమైందని తెలిపింది. ఆయన బాధితురాలి తరుఫున పోలీస్ స్టేషన్‌లో గట్టిగా వాదించినట్లు తెలిసింది. ఈ విషయంపై థానే డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ శర్మ మాట్లాడుతూ.. బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసుల విచారణ చేపట్టారని తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని.. ప్రస్తుతం అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితురాలి న్యాయచేస్తామని.. నిందితులపై కఠిన చరయలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


Also Read: Raksha Bandhan Wishes 2023: రాఖీ శుభాకాంక్షలు ఇలా ప్రత్యేక ఫోటోస్, కోట్స్‌తో తెలియజేయండి..   


Also Read: Aditya-L1 Mission Rehearsals: ఆదిత్య L1 ప్రయోగం రాకెట్ చెకింగ్, రిహార్సల్స్ పూర్తి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook