Rajasthan man tied wife to bike and drags around the village watch Nagaur: కొంత మంది భర్తలు షాడిస్టులుగా ప్రవర్తిస్తుంటారు. పెళ్లైన తర్వాత నుంచి తమ వాళ్లకు చుక్కలు చూపిస్తుంటారు. వంట చేయడం రాదని, చీరసరిగ్గా కట్టుకొలేదని వేధింపులకు పాల్పడుతుంటారు. మరికొందరు ప్రతి చిన్న దానికి అనుమానంగా వ్యవహరిస్తుంటారు. ఫోన్ లో మాట్లాడిన, ఎవరితో ఉన్న.. తమ వాళ్లతో మాట్లాడిన కూడా అనుమానంతోనే ఉంటారు. పొరపాటున మంచి చీర వేసుకుంటే.. దానికి కూడా వంద అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. చికెన్ లో ఉప్పు సరిగ్గాలేదని తాగి వచ్చి కొందరు గొడవలకు దిగుతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొన్ని చోట్ల ఆడవాళ్లు సైతం..తామేం తక్కువా.. అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఒకర్నికట్టుకుని, మరోకరితో ఎఫైర్ లను నడిపిస్తుంటారు. ఒకరికి తెలియకుండా.. సీక్రెట్ గా యవ్వారాలు నడిపిస్తుంటారు.ఈ క్రమంలో కొందరు భార్యలను కొడుతు, టార్చర్ చేస్తుంటారు. కొన్నిసార్లు చంపడానికి సైతం వెనుకాడరు. కట్నం తేవాలని, పుట్టింట్లో నుంచి డబ్బులు, నగలు తేవాలని కూడా దారుణాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటునే ఉంటాయి. తాజాగా, మరో షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


రాజస్థాన్ లోని నాగౌర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నహర్ సింగ్ పురా గుండా గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమారామ్ మేఘ్వాల్ అనే వ్యక్తి తనచుగా తన భార్యతో గొడవలకు దిగేవాడు.తాగి వచ్చి రచ్చ రచ్చ చేసేవాడు. అంతేకాకుండా.. ఇతను పదినెలల క్రితం ఒక మహిళను 2 లక్షలకు కొనుగోలు చేశాడు. అతను భార్యను ప్రతిరోజు టార్చర్ చేసేవాడు. పశువు కన్నా.. హీనంగా కూడా ఆమెపై బరితెగించేవాడు. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం.. తన భార్యకాళ్లను బైక్ కు కట్టేసి, గ్రామంలో ఈడ్చుకుంటూ వచ్చాడు.


అక్కడున్న వారు ఎవరు కూడా అతగాడిని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. చుట్టుపక్కల వారు చూస్తునే ఉండిపోయారు. పాపం.. మహిళ మాత్రం. కాపాడండి అంటూ అరుపులు, కేకలుపెట్టింది. కొంత మంది ఈ వీడియోను మాత్రం సీక్రెట్ గా తీశారు. కానీ దగ్గరకు వెళ్లి ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. చివరకు ఆమెను ఒక ఇంటికి దగ్గరకు తీసుకెళ్లి.. వదిలేశాడు. సదరు మహిళ దగ్గరకు కొంత మంది వెళ్లి ఆమెను విడిపించారు. ఈ ఘటన వైరల్ కావడంతో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter