Javelin Thrown by Student Pierces into An Other Boy's Head: ఒక విద్యార్థి విసిరిన జావెలిన్ గుచ్చుకుని మరో 15 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఒక విద్యార్థి జావెలిన్ థ్రో విసరడం ప్రాక్టీస్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది అని రాయఘడ్ జిల్లా పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థిని హుజెఫా దావరేగా గుర్తించారు. జావెలిన్ థ్రో ప్రాక్టీస్ చేస్తోన్న విద్యార్థిని జావెలిన్ విసిరిన సమయంలో అవతలి వైపు నిలబడి ఉన్న హుజెఫా దావరే కిందకు వంగి తన షూ లేస్ కట్టుకుంటున్నాడు. అదే సమయంలో జావెలిన్ స్టిక్ వచ్చి అతడి తలలో గుచ్చుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జావెలిన్ కర్రకు ముందు భాగం పదునుగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఆ పదునైన భాగం వేగంగా వచ్చి బలంగా గుచ్చుకోవడంతో అది బాలుడి తలను ఛిద్రం చేసేసింది. తలలో జావెలిన్ కర్ర గుచ్చుకుని రక్తమోడుతున్న బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఆస్పత్రికి చేరుకునేలోపే బాలుడు చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. పదునుగా ఉన్న జావెలిన్ తనవైపే వస్తోంది అనే విషయాన్ని దావరె గుర్తించలేకపోయాడని.. అందువల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది అని రాయఘడ్ పోలీసులు మీడియాకు తెలిపారు. 


రాయఘడ్ జిల్లా మంగావ్ తాలుకాలోని గోరేగావ్ సమీపంలోని పురార్ వద్ద ఉన్న ఐఎన్టీ ఇంగ్లీష్ స్కూల్ లో బుధవారం మధ్యాహ్నం స్కూల్ విద్యార్థులు జావెలిన్ థ్రో విసరడం ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధారణంగా జావెలిన్ థ్రో ప్రాక్టీస్ చేసే సమయంలో ఎటువైపు అయితే జావెలిన్ విసురుతారో.. అటువైరు ఎవ్వరూ లేకుండా చూసుకుంటుంటారు. ఒకవేళ ఉన్నా.. వాళ్లు జావెలిన్ రావడాన్ని గమనించుకుంటూ జాగ్రత్త పడటడం జరుగుతుంటుంది. 


ఈ ఘటన విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ మృతి చెందిన హుజెఫా దావరే మాత్రం జావెలిన్ తన వైపు రావడం గమనించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది అని అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనతో గోరెగావ్ లో విషాదం అలుముకుంది. తాలుకా స్థాయి క్రీడల పోటీల కోసం ఐఎన్టీ ఇంగ్లీష్ స్కూల్ విద్యార్థులు జావెలిన్ థ్రో ప్రాక్టీస్ చేస్తున్నారని.. చనిపోయిన హుజెఫా దావరే కూడా ఈ పోటీల్లో పాల్గొనాల్సి ఉందని.. కానీ దురదృష్టవశాత్తుగా ప్రాక్టీసు చేస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది అని స్థానిక అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండి : Illicit Affairs: మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కూతురిపైనా కన్నేశాడు.. కానీ ఇంతలోనే


ప్రస్తుతానికి ప్రమాదవశాత్తుగా సంభవించిన మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని.. స్కూల్ ఆవరణలో ప్లే గ్రౌండ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించి, విచారణ చేపట్టాకే మరిన్ని విషయాలా తెలుస్తాయని రాయఘడ్ పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తుగా జరిగిన ఘటననా లేక జావెలిన్ విసిరిన విద్యార్థి నిర్లక్ష్యంగా వ్యవహరించాడా అనేది తేలాల్సి ఉంది అని పోలీసులు చెబుతున్నారు.


ఇది కూడా చదవండి : Brother, Sister Got Married: పారిపోయి పెళ్లి చేసుకుని విజయవాడకు వచ్చిన అన్నాచెల్లెలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి