Solapur Road Accident: మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ముంబైకి 390 కిలోమీటర్ల దూరంలోని సంగోలా పట్టణానికి (Sangola town) సమీపంలో సాయంత్రం 6.45 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజులు కిందట 32 మంది యాత్రికుల (వార్కారీలు) బృందం కొల్హాపూర్ జిల్లాలోని జాతర్‌వాడి నుండి పంఢర్‌పూర్ దేవాలయానికి వెళ్లేందుకు పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో వారు సంగోలాకు చేరుకోగానే ఓ కారు అదుపుతప్పి వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ లోనూ...
హైదరాబాద్ ఎస్సార్ నగర్ లో ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపావళి నాడు వీధిలో నిల్చున్న ఓ మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె తీవ్రగాయాల పాలైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. యాక్సిడెంట్ చేసిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి ఉడాయించగా...తీవ్రంగా గాయపడిన బాధితురాలిని బంజరాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కారు నడిపిన వ్యక్తి మైనర్ గా గుర్తించారు. దాంతోపాటు కారు యాజమానిపై కూడా కేసు నమోదు చేశారు. 


Also read: Morbi Cable Bridge tragedy: కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 137 కి చేరిన మృతుల సంఖ్య 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి