Shocking Incident: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగిపై వైద్యుడు దారుణంగా ప్రవర్తించాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా లేచి కుర్చీపై కూర్చున్న రోగిపై దాడికి పాల్పడ్డాడు. కింద పడేసి కాళ్లతో తన్నిన దృశ్యాలు హల్‌చల్‌ చేశాయి. వైద్యం చేయాల్సిన వ్యక్తే దాడికి పాల్పడడం విస్తుగొల్పింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల ప్రవర్తనకు ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది. దారుణంగా ప్రవర్తించిన వైద్యుడిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Girl Pregnancy: పరీక్ష హాల్‌లో అడ్డం పడిన బాలిక.. ఆస్పత్రికి వెళ్తే గర్భవతి రూ.2 లక్షలకు ఖరీదు


 


మహోబా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనారోగ్యంతో బాధపడుతూ ఆకాశ్‌ ఉపాధ్యాయ అనే యువకుడు వచ్చాడు. డాక్టర్‌ ఆర్పీ సింగ్‌ ఆ యువకుడిని పరీక్షించి వైద్య సేవలు అందించాడు. అనంతరం మందులు ఏవీ వేసుకోవాలో ఓ చీటీపై రాసి వైద్యుడు బయట కొనుక్కోవాలని చెప్పాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు బయట కొనుక్కోవడం ఏమిటని ఆకాశ్ ప్రశ్నించాడు. ఈ విషయంలో వైద్యుడు, ఆకాశ్ మధ్య కొంత వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన వైద్యుడు ఆర్పీ సింగ్‌ వెంటనే లేచి ఆకాశ్‌పై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా కొట్టి కాళ్లతో తన్నుతూ తన గది నుంచి ఆకాశ్‌ను బయటకు పంపించాడు.

Also Read: Boy Hospitalised: పాడు సమాజం.. ఏపీలో అబ్బాయిపై సామూహిక అత్యాచారం


 


ఈ దృశ్యాలన్నీ వైద్యుడి రూమ్‌లోని సీసీ టీవీలో రికార్డయ్యాయి. వీటిని చూసిన అధికారులు, రోగులు నివ్వెరపోయారు. ఈ సంఘటనపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడు ఆర్పీ సింగ్‌పై కేసు నమోదు చేశారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు బయట ఎందుకు కొనాలని ప్రశ్నించిన యువకుడి విషయం తప్పు లేదని నెటిజన్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కోల్పోవడానికి ఇలాంటి వైద్యులే కారణమని వాపోతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నా ఉద్యోగుల తీరుతోనే ఆస్పత్రులకు ఆదరణ తగ్గుతోందని కామెంట్లు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712