High Court Slit: ఎక్కడా న్యాయం లభించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అలాంటి పవిత్ర ప్రదేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. కోర్టు హాల్‌లోకి వెళ్లి ఏకంగా ప్రధాన న్యాయమూర్తి ఎదుట కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక హైకోర్టులో చోటుచేసుకుంది. అయితే అతడు ఎందుకు అలా చేశాడనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఈ సంఘటన న్యాయవర్గాల్లో కలకలం రేపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: April Fool Prank Tragedy: ఫ్రెండ్‌ను 'ఏప్రిల్‌ ఫూల్‌' చేయబోయి ప్రాణం పోగొట్టుకున్న విద్యార్థి.. వీడియో కాల్‌లో


కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన శ్రీనివాస్‌ బుధవారం బెంగళూరులోని కర్ణాటక హైకోర్టుకు చేరుకున్నాడు. ఉదయం కోర్టుకు వచ్చిన వ్యక్తి హాలు ప్రవేశ ద్వారా వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి ఒక ఫైల్‌ అందజేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిలాయ్‌ విపిన్‌చంద్ర అంజరియా ఎదురుగా వచ్చి తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ హఠత్పారిణామానికి ఖంగుతిన్న న్యాయవాదులు వెంటనే బయటకు వెళ్లగా.. భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నాడు. గొంతు కోసుకున్న శ్రీనివాస్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర ప్రధాన న్యాయస్థానంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది.

Also Read: Fire Accident: బాత్రూమ్‌లో చిక్కుకున్న అక్కాచెల్లెళ్లు.. తలుపులు పగులగొట్టి కాపాడినా కన్నీరే!


ఈ ఘటనపై ప్రధాన న్యాయమూర్తి అంజరియా ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులోకి కత్తితో రావడం చూస్తుంటే భద్రతా లోపాలు స్పష్టంగా బయటపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు స్పందించారు. 'అతడు ఎందుకు గొంతు కోసుకున్నాడనేది ఇంకా తెలియలేదు. కోర్టు హాల్‌లోకి చేరుకోగానే వెంటనే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి కారణం ఇంకా తెలియలేదు. సంఘటనపై విచారణ చేస్తున్నాం' అని పోలీస్‌ అధికారి వెల్లడించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook