Shraddha Phone Last Location: శ్రద్ధా హత్య కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు శ్రద్ధా ఫోన్‌కు సంబంధించిన సీడీఆర్ (కాల్ డిటెయిల్ రికార్డ్) రిపోర్టును సేకరించారు. మే 18, 19వ తేదీల్లో మెహ్రౌలీలోని ఛతర్‌పూర్‌లో శ్రద్ధా ఫోన్ చివరి లొకేషన్ అని నివేదికలో వెల్లడైంది. మే 18న, అఫ్తాబ్ కూడా శ్రద్ధా మొబైల్ నుంచి చాలా కాల్స్ చేసాడు. అంతకుముందు నుంచి కూడా ఆమె నంబర్‌కు చాలా కాల్స్ వచ్చాయి. మే 19వ తేదీ నుంచి శ్రద్ధా ఫోన్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొబైల్‌ సీడీఆర్‌ ద్వారానే పోలీసులకు చివరి లొకేషన్‌ తెలిసింది. అయితే శ్రద్ధా ఫోన్ నుంచి అఫ్తాబ్ ఎవరికి కాల్ చేశాడు..? ఆ ఫోన్‌కు ఎవరి కాల్స్ వచ్చాయో పోలీసు వర్గాలు స్పష్టం చేయలేదు. హత్య జరిగిన రోజు ఘటన జరిగిన ఇంటి సమీపంలోనే శ్రద్ధా ఫోన్ లొకేషన్ ఉన్నట్లు విచారణలో తేలిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 


అఫ్తాబ్ ఫోన్‌ను ఓఎల్‌ఎక్స్‌లో విక్రయం


మే 19వ తేదీ రాత్రి శ్రద్ధా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రద్ధా హత్యకేసులో ఇదే పెద్ద సాక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు. అఫ్తాబ్‌కు శిక్ష పడేందుకు ఈ సాక్ష్యం కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. అదేసమయంలో హత్య జరిగిన నాలుగు నెలల తర్వాత నిందితుడు అఫ్తాబ్ తన మొబైల్ మార్చుకున్నాడు. 


నిందితుడు తన పాత మొబైల్‌ను ఓఎల్‌ఎక్స్‌లో విక్రయించి అదే నంబర్‌పై మరో‌ సిమ్‌ను తీసుకున్నాడు. ఈ మొబైల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రద్ధా మొబైల్ ఇంకా రికవరీ కాలేదు. ప్రస్తుతానికి ఆమె మొబైల్ చివరి లోకేషన్‌పై మాత్రమే క్లారిటీ వచ్చింది. ఈ కేసులో ఇంతకుముందు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని ముక్కలు చేయడానికి చైనా హెలికాప్టర్‌ను ఉపయోగించినట్లు నార్కో టెస్టులో వెల్లడించాడు. గురుగ్రామ్‌లోని కార్యాలయం సమీపంలోని పొదల్లో శ్రద్ధా మృతదేహాన్ని నరికిన రంపాన్ని ఎక్కడో విసిరివేసినట్లు చెప్పిన విషయం తెలిసిందే. 


Also Read: Mohammed Shami: ఆసుపత్రిలో చేరిన మహ్మద్ షమీ.. బెడ్‌పై ఫొటోలు వైరల్  


Also Read: Hcu Thailand Student: హెచ్‌సీయూ అత్యాచారయత్న ఘటనలో ట్విస్ట్.. ఇంటికి తీసుకువెళ్లి మద్యం సేవించి.. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి