Shraddha Murder Case: అఫ్తాబ్ ఇంట్లో పదునైన వస్తువు, అడవిలో శ్రద్ధా వాకర్ ఎముకలు
Shraddha Walkar Body Parts : శ్రద్ధా వాకర్ శరీర భాగాల డిఎన్ఏ ఎనాలసిస్ కోసం ఆమె తండ్రి, సోదరుడి రక్త నమూనాలను తీసుకున్నారు. అఫ్తాబ్ పూనావాలా చెప్పిన అన్ని చోట్ల శ్రద్ధా వాకర్ శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. లభించిన ఆధారాలను లభించినట్టే ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తున్నారు.
Shraddha Murder Case: శ్రద్ధా మర్డర్ కేసు దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తవ్వి తీస్తూనే ఉన్నారు. ఇప్పటికే శ్రద్ధా శరీర భాగాలతో ఉన్న బ్యాగుతో అఫ్తాబ్ నగరంలో సంచరించినట్టుగా సీసీటీవీ దృశ్యాలు ఢిల్లీ పోలీసులకు చిక్కినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా తాజాగా ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు ఇంకొంత పురోగతి సాధించినట్టు తెలుస్తోంది.
ఛత్తర్‌పూర్లోని అఫ్తాబ్ నివాసంలో సోదాలు చేపట్టిన ఢిల్లీ పోలీసులు.. అక్కడి నుంచి పదునైన వస్తువును స్వాధీనం చేసుకున్నారు. ఈ పదునైన వస్తువునే ఆయుధంగా మల్చుకుని శ్రద్దావాకర్ శవాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి ఉపయోగించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎన్డీటీవీ ప్రచురించిన ఓ వార్తా కథనం ప్రకారం ఢిల్లీ శివార్లలోని మోహ్రౌలి అటవీ ప్రాంతంలో శ్రద్ధా వాకర్ శరీర భాగాల కోసం అన్వేషిస్తున్న పోలీసులకు కొన్ని ఎముకలు లభించాయి. అవి శ్రద్ధా శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పడేసిన శరీర భాగాలే అయ్యుంటాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ ఎముకలను ఎనాలసిస్ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపించారు. పోరెన్సిక్ నివేదిక వస్తే.. ఇందులో ఈ కేసులో ఇంకొంత ముందడుగు పడినట్టే అవుతుంది.
శ్రద్ధా వాకర్ శరీర భాగాల డిఎన్ఏ ఎనాలసిస్ కోసం ఆమె తండ్రి, సోదరుడి రక్త నమూనాలను తీసుకున్నారు. అఫ్తాబ్ పూనావాలా చెప్పిన అన్ని చోట్ల శ్రద్ధా వాకర్ శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. లభించిన ఆధారాలను లభించినట్టే ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికీ శ్రద్ధా వాకర్ అస్తి పంజరం ఇంకా లభించనే లేదు. మరోవైపు అఫ్తాబ్ పూనావాల మానసిక పరిస్థితిని సైతం పోలీసులు ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. లాకప్‌లో ఉన్న అఫ్తాబ్ ఎప్పుడు ఏం చేస్తున్నాడు అని గమనిస్తున్నారు. అఫ్తాబ్ చుట్టూ రక్షణ వలయం కోసం అధిక సంఖ్యలో సిబ్బందిని మోహరించారు. విచారణలో భాగంగా సీన్ రికన్‌స్ట్రక్షన్ కోసం అఫ్తాబ్ పూనావాలాని బయటికి తీసుకెళ్లిన అన్ని సంర్భాల్లోనూ అతడి సేఫ్టీ గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.