Minor Students Extorted: పిల్లలకు ఫోన్లు, ట్యాబ్లెట్లు వంటి డిజిటల్‌ పరికరాలు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. లేకుంటే మీ ఇంట్లోని వస్తువులు మాయమవుతాయి. బీరువాలో ఉన్న నగదు, ఆభరణాలు కూడా కనిపించకుండాపోతాయి. ఒక చోట చిన్నారులు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై సొంత ఇంట్లోనే దొంగతనం చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకోగా.. పోలీసులు విచారణ చేపట్టగా చిన్నారుల కథ వింటే అవాక్కయ్యారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Anuj Thapan: సల్మాన్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. కస్టడీలో కీలక నిందితుడు ఆత్మహత్య


 


కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లా గంగావతి తాలూకాలోని ఆర్‌ఆర్‌నగర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు తరచూ ఆన్‌లైన్‌ గేములు ఆడుతుంటారు. ఆ గేమ్‌లకు బానిసలుగా మారారు. గేమ్‌లు ఆడేందుకు తన స్నేహితులతో కలిసి ఓ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తన స్నేహితులతో కలిసి ఓ విద్యార్థి సొంత ఇంట్లో దొంగతనానికి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూ.23 లక్షల విలువైన 300 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అనంతరం ఆ ఆభరణాలను తెలిసిన వారి ద్వారా బంగారు దుకాణంలో తాకట్టు పెట్టారు.

Also Read: SR Nagar Oyo Death: ఓయో రూమ్‌ బాత్రూమ్‌లో ప్రియుడు ఆకస్మిక మృతి.. ప్రియురాలే చంపిందా?


 


వచ్చిన డబ్బులతో నలుగు విద్యార్థులంతా కలిసి పండుగ చేసుకున్నారు. పబ్‌ జీ ఆటలు ఆడుతూ.. విందులువినోదాలతో ఆ డబ్బులన్నంతా ఖర్చు పెట్టేశారు. అంతటితో ఆగకుండా ఆన్‌లైన్‌ బెట్టింగులకు కూడా పాల్పడ్డారు. ఇలా డబ్బును ఇష్టారీతిన ఖర్చు చేస్తూ విలావసంతంగా బతికారు. అయితే ఒకరోజు ఇంట్లో దాచిన నగదు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఇళ్లంతా వెతికినా ఆభరణాలు కనిపించకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఇంటిని పరిశీలించగా..  ఆ సమయంలో విద్యార్థులు కొంత భయంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్లు చేసిన దొంగతనం బయటపడింది.


దొంగతనం చేసిన వారిని వివేక్‌ (19), వేమన్‌ (20)గా పోలీసులు గుర్తించారు. ఇక వారు బంగారు ఆభరణాలు విక్రయించడానికి సునీల్‌ (28), కార్తీక్‌ (30) సహకరించారు. వీరందరినీ అదుపులోకి పోలీసులు విచారణ చేపట్టారు. ఆన్‌లైన్‌ గేమ్‌ వ్యసనాలకు పాల్పడి విద్యార్థులు ఇలా చేశారని రాజరాజేశ్వర్‌నగర్‌ పోలీస్‌ సీఐ మార్కండేయ తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని.. వారికి ఫోన్లు దూరంగా ఉంచాలని సూచించారు. చిన్నారులు ఫోన్లకు వ్యసనం కాకుండా ఇతర ఆటలు ఆడిపించాలని చెప్పారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter