Students Involved In Ragging Expelled From College In Odisha: ఒడిశాలోని గంజాం జిల్లాలోని ఓ ప్రభుత్వ కాలేజ్ లలో బాలికపై ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను కాలేజ్ నుంచి బహిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. ఇద్దరు జువెనైల్స్ (ప్లస్ I), ముగ్గురు మేజర్ (ద్వితీయ సంవత్సరం) విద్యార్థులతో సహా ఐదుగురు విద్యార్థులను ర్యాగింగ్ ఘటనలో ప్రమేయం ఉన్నందుకు పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ద్వారా ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను గుర్తించామని కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీలా ఖడంగా తెలిపారు. వీరందరినీ కాలేజ్ నుంచి డీటైన్ చేశామని వారికి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇచ్చి కాలేజీ నుంచి బహిష్కరిస్తామని అన్నారు. అంతేకాక వార్షిక పరీక్షల కోసం ఇప్పటికే అప్లికేషన్స్ నింపి ర్యాగింగ్‌కు పాల్పడుతున్న ప్లస్‌టూ (2వ సంవత్సరం) విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని కూడా అక్కడి ప్రిన్సిపాల్ తెలిపారు.


ఇక ఈ ఘటనపై హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌కు లేఖ రాస్తామని కూడా ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. గురువారం జరిగిన క్రమశిక్షణ కమిటీ, యాంటీ ర్యాగింగ్‌ సెల్‌ సమావేశంలో 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ ఖడంగా పేర్కొన్నారు. ఇక ఇప్పటికే వారిని డీటైన్ చేసే  ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో కొందరు విద్యార్థులు జూనియర్ విద్యార్థినిని వేధిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.


ఈ క్రమంలో బాధితురాలు బుధవారం బడా బజార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక ఇదిలా ఉండగా, బెర్హంపూర్‌లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సర్బన్ వివేక్ ఎం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కాలేజ్ లోని ఇన్‌స్టిట్యూట్‌లో యాంటీ ర్యాగింగ్ మెకానిజంపై కళాశాల ప్రిన్సిపాల్‌తో చర్చించారు. అరెస్టయిన ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు 18 ఏళ్లు పైబడిన వారేనని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ఇతరులపై విచారణ జరుపుతున్నామని ఇది కేవలం ర్యాగింగ్ కేసు మాత్రమే కాదని, బాధితురాలిపై లైంగిక వేధింపుల కేసు అని అన్నారు.


నిందితులపై ర్యాగింగ్ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం, ఐటీ చట్టం సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. ర్యాగింగ్‌పై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఏ సంస్థలోనైనా టోల్ ఫ్రీ నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు. ఇన్‌స్టిట్యూట్‌లోని యాంటీ ర్యాగింగ్ సెల్ సరిగా పని చేయకపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు.


Also Read: Tabassum Govil Death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. మరణించిన వార్త బయట పెట్టొద్దని మాట తీసుకున్న నటి?


Also Read: Allu Aravind Supports Dil Raju: దిల్ రాజుకు అల్లు అరవింద్ సపోర్ట్.. అసలు అది జరగదంటూ కామెంట్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook