Chandrababu Nara Lokesh Condolence: తన అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి కావడంతో మొక్కు తీర్చుకునేందుకు వెళ్లిన కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ విషాద సంఘటనతో ఆమె కుటుంబంతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. మొక్కు తీర్చుకుని తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న నారా లోకేశ్‌ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆమె మరణానికి సంతాపం తెలిపాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: మళ్లీ జన్మ ఉంటే కుప్పం బిడ్డగా పుట్టి రుణం తీర్చుకుంటా: చంద్రబాబు భావోద్వేగం


కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ (33). ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని షిర్డీ సాయిబాబాకు కోరారు. చంద్రబాబు సీఎం అయితే మొక్కులు తీర్చుకుంటానని మొక్కుకున్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఆమె సంబరపడింది.

Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు


కోరిన కోరిక తీరడంతో ఆమె షిర్డీలో తన మొక్కులు చెల్లించేందుకు షిర్డీ వెళ్లారు. చంద్రబాబు  ముఖ్యమంత్రి అయిన సందర్భంగా షిరిడి సాయినాథ్‌కు మొక్కులు చెల్లించుకుని ఆనందంగా ఆమె తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే తిరిగి వస్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.


గత ప్రభుత్వం వేధింపులు
కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రమ్యకృష్ణ తీవ్ర వేధింపులకు గురయ్యారు. గన్నవరం పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో రమ్యకృష్ణ  మీద కేసు నమోదైంది. ఆ సమయంలో రమ్యకృష్ణ  చంటి పిల్లవాడిని వదిలేసి రెండు నెలల పాటు అజ్ఞాతంలో జీవించారు. ఆమెను వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది గురిచేసింది. చంద్రబాబు  మళ్లీ ముఖ్యమంత్రి అయితే చాలు ఎన్ని కష్టాలైనా భరిస్తానని రమ్యకృష్ణ చెప్పేవారు. అలాంటి ఆమె చంద్రబాబు పాలనను చూడకుండానే వెళ్లిపోవడంతో టీడీపీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు.


చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. లోకేశ్‌ కూడా ఎక్స్‌లో స్పందించారు. 'షిర్డీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండవ రమ్యకృష్ణ మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్ను. ఉంగుటూరు మండల మహిళా అధ్యక్షురాలిగా గొప్ప పోరాట పటిమ కనబరిచిన రమ్యకృష్ణ మృతి టీడీపీకి తీరనిలోటు. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని నారా లోకేశ్‌ 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి