Paragliding Crash: మనాలీలో తప్పిన పారాగ్లైడింగ్.. ఆకాశం పైనుంచి పడి తెలంగాణ యువతి దుర్మరణం
Kullu Manali: మంచు ప్రదేశంలో విహారానికి వెళ్లిన తెలంగాణ యువతి ఒకరి నిర్లక్ష్యం కారణంగా దుర్మరణం పాలైంది. పారాగ్లైడింగ్ చేస్తూ ఆకాశానికి ఎగిరిన ఆమె అక్కడి నుంచి అకస్మాత్తుగా కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Telangana Tourist Woman Died: హిమాలయ పర్వతాల రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణ యువతి విహార యాత్ర విషాదంగా మిగిలింది. ప్రకృతి అందాలు, మంచు దుప్పటిలో తేలియాడాలని ఆశపడిన ఆమె కోరిక ఆఖరిది అయ్యింది. మంచు కొండల్లో పారాగ్లైడింగ్ కోసం వెళ్లిన ఆమె దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ఆమె మరణించింది. నిర్వాహకుల భారీ నిర్లక్ష్యానికి ఆమె ప్రమాదానికి గురయ్యింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Also Read: Farmers Protest: మళ్లీ కదం తొక్కుతున్న రైతులు.. ఢిల్లీలో ఎక్కడిక్కడ నిర్బంధం, సరిహద్దులు బంద్?
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్య (26) హైదరాబాద్‌లో నిసివస్తుండేది. వారాంతం కావడంతో కొందరితో కలిసి నవ్య హిమాచల్ ప్రదేశ్‌లోని రమణీయ ప్రాంతం మనాలీని సందర్శించేందుకు వెళ్లింది. మనాలీలోని దోబీ అనే ప్రాంతంలో పారాగ్లైడింగ్‌కు నవ్య వెళ్లింది. పారాగ్లైడింగ్ వెళ్లగా ఆమెకు బెల్ట్ సక్రమంగా పెట్టలేదని తెలిసింది. పైకి వెళ్లాక పారాగ్లైడింగ్ బెల్ట్ ఊడిపడడంతో నవ్య అకస్మాత్తుగా ఓ ఇంటిపై పడిపోయింది. చాలా ఎత్తుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలై నవ్య అక్కడికక్కడే మృతిచెందింది. పారాగ్లైడింగ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తేలింది. వెంటనే పారాగ్లైడింగ్ పైలెట్‌ను పోలీఉలు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కారణంగా అక్కడ తాత్కాలికంగా పారాగ్లైడింగ్‌ను నిషేధించారు.
Also Read: GPS Based Toll: ఇక ఫాస్టాగ్‌కు బై బై.. తెరపైకి కొత్త టోల్ విధానం.. ఇక హైవేపై రయ్యిన దూసుకెళ్లొచ్చు
ఈ సంఘటనపై కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైనా శర్మ స్పందిస్తూ.. 'మానవ తప్పిదంతో ఈ ప్రమాదం జరిగింది. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, పరికరాలు, పైలెట్‌కు అనుమతి ఉంది. ప్రమాదం జరిగినప్పుడు వాతావరణ సమస్యలు కూడా లేవు. పైలెట్ నిర్లక్యమే ఉందని ప్రాథమికంగా నిర్ధారించాం. విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ పారాగ్లైడింగ్‌ను నిషేధిస్తున్నాం' అని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన చేసినట్లు కులూ ఎస్పీ డాక్టర్ కార్తీకేయన్ గోకుల్ చంద్రన్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతురాలి కుటుంబసభ్యులకు పంపించినట్లు చెప్పారు. అక్కడి కలెక్టర్ ఎస్.రవీష్ కూడా ఘటనపై విచారణకు ఆదేశించారు.
నిత్యం కులులోని దోబీ ప్రాంతం పారాగ్లైడింగ్‌కు ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రెండేళ్ల వ్యవధిలో దాదాపు మూడు, నాలుగు సంఘటనలు చోటుచేసుకున్నాయి. వరుస ప్రమాదాలతో కులూ అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలికంగా పారాగ్లైడింగ్‌కు నిషేధం విధించారు. అక్కడి పరిస్థితులు, పారాగ్లైడింగ్ పైలెట్‌ల పనితీరుపై విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook