Third Husband Killed His Wife For Having An Affair With Her Second Husband: ఉత్తర్ ప్రదేశ్ లో ఒక సంచలన మర్డర్ కేసు బయటకొచ్చింది. ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్‌లోని బృందావన్ ఎన్‌క్లేవ్‌లో డిసెంబర్ 25 సాయంత్రం భవ్య శర్మ (35)ని ఆమె సొంత భర్త వినోద్ శర్మ కత్తితో పొడిచి చంపడంతో పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేశారు. విచారణలో భవ్య మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మూడో భర్త వినోద్‌తో ఉన్నప్పుడు కూడా ఆమె తన రెండో భర్త అనీష్‌తో సంబంధం పెట్టుకుందని తెలిసింది. డిసెంబర్ 24న వినోద్ వీడియో కాల్‌లో ఆమెను అనిష్‌తో చూశాడని, దీంతో 25న కుట్ర పన్ని ఆమెను హత్య చేసి, అతిగా మద్యం సేవించడం వల్లే చనిపోయిందని పోలీసులను తప్పుదోవ పట్టించేలా చేయడానికి యత్నించాడని గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని వినోద్ 26వ తేదీ ఉదయం మొదట భవ్య తల్లికి, ఆపై పోలీస్ స్టేషన్‌కు తెలియజేశాడు.


భవ్య మృతదేహం ఇంట్లోనే మంచంపై పడి ఉండగా కడుపులో కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో షాక్ తిన్న పోలీసులు వినోద్ ఎందుకు అబద్ధం ఆడాడు? అని అతడిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. ఇక ఆమె రెండో భర్త అనీష్‌తో భవ్యకు సంబంధం ఉన్నట్లు వినోద్‌ అనుమానిస్తున్నట్లు ఏసీపీ అన్షు జైన్‌ తెలిపారు. ఆమె ఆయుర్వేద ఔషధాల సరఫరా కంపెనీలో పని చేస్తూ ఉండడంతో ఆమె తరచుగా ఇండోర్‌, జబల్‌పూర్‌లకు వెళ్లేదని అంటున్నారు.


అలా ఆమె 24వ తేదీన కూడా వెళ్లిందని అదే రోజు భవ్య వీడియో కాల్ చేసిందని వినోద్ విచారణలో తెలిపాడు. ఆ వీడియో కాల్ లో ఆమెతో పాటు అనీష్ కూడా కనిపించగా వెంటనే వినోద్ అనిష్ ను బెదిరించాడు, అలాగే అప్పుడే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. వినోద్ ఎలాంటి పనులు చేయడని భవ్య సంపాదనతో ఇల్లు నడిచేదని పోలీసులు గుర్తించారు. ఇక తాను, భవ్య కలిసి తరచూ మద్యం తాగేవారని వినోద్ తెలిపారు.


25వ తేదీ ఉదయం భవ్య ఇంటికి తిరిగి వచ్చింది, వచ్చినప్పుడు ఇద్దరూ మద్యం తాగేందుకు కూర్చున్నారు. కుట్రలో భాగంగా తానూ తక్కువ తాగి భవ్యకు ఎక్కువ మద్యం ఇచ్చాడు. సాయంత్రం అయ్యేసరికి ఆమె పూర్తిగా తాగి మంచం మీద పడుకుంది. అయితే వీరి కుమారుడు ఆదిల్ ఇంట్లోనే ఉన్నాడు. దీంతో అతనికి డబ్బు ఇచ్చి మార్కెట్ నుండి బొమ్మ తీసుకురావాలని చెప్పడంతో ఆటను వెళ్లగానే భవ్య కడుపులో పొడిచాడు.


భవ్యకు అదే ప్రదేశంలో ఆపరేషన్ జరిగింది. కుట్టిన ప్రదేశానికి సమీపంలో కూరగాయల కత్తి దించడంతో రక్తస్రావం అయి మరణించింది. ఇక ఆదిల్ తిరిగి వచ్చినప్పుడు, మమ్మీ నిద్రలో ఉందని, అతన్ని డిస్టర్బ్ చేయవద్దని చెప్పాడు వినోద్. ఇక ఆ తరువాత భవ్య రక్తంతో తడిసిన దుస్తులను మార్చాడు, మంచం మీద నుండి రక్తాన్ని శుభ్రపరిచాడు. టవల్ తో మృతదేహాన్ని తుడిచాడు. ఆ తరువాత, భవ్య బట్టలు ఉతికి ఆరబెట్టి ఆమె టవల్, మొబైల్ వాషింగ్ మెషీన్ వెనుక దాచి ఉంచారు. గదిలోని అల్మారా వెనుక కత్తి దాచాడు.


ఇక ఆమె మొదటి వివాహం 2004లో ఢిల్లీకి చెందిన యోగేంద్ర కుమార్ అనే యువకుడితో జరిగింది. పెళ్లయ్యాక భవ్యకు అంజలి అని పేరు పెట్టారు. వారిద్దరికీ 16 సంవత్సరాల వయస్సు గల నిహాల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతను తన తండ్రితో నివసిస్తున్నాడు. 13 ఏళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత అంజలి, యోగేంద్ర విడిపోయారు. ఇక యోగేంద్ర నుండి విడిపోయిన తర్వాత, ఆమెకు ఢిల్లీలోనే అనిష్‌తో పరిచయం ఏర్పడింది.


ఈ సమయంలో తన పేరును అఫ్సానాగా మార్చుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఆదిల్ అనే కుమారుడు జన్మించాడు. పెళ్లయిన ఏడాదిన్నర తర్వాత అఫ్సానా, అనీష్ విడిపోయారు. ఆదిల్ తన తల్లితో కలిసి జీవించడం ప్రారంభించగా అనీష్ నుండి విడిపోయిన తర్వాత మూడవ సారి వినోద్ ను పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరూ 2019లో పెళ్లి చేసుకున్నారు, ఇక పెళ్లయ్యాక తన పేరును అఫ్సానా నుంచి భవ్యగా మార్చుకుంది ఆమె. 


Also Read: Samantha Ruthprabhu New Year Wishes: అందుకు ఇదే సరైన సమయం.. హాట్ టాపిక్ గా మారిన సమంత పోస్టు


Also Read: Group 2 : నిరుద్యోగులకు కేసీఆర్ న్యూఇయర్ గిఫ్ట్.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook