Jathara Shock: గ్రామంలో అమ్మవారి జాతర సందర్భంగా భారీ ఏర్పాట్లు జరుగుతుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఏర్పాట్లు చేస్తున్న ముగ్గురు యువకులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. మూడు కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ విషాద సంఘటన తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి


పర్వతగిరి మండలం మోత్యతండాలో అమ్మవారి జాతర ఉంది. ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం దుర్గమ్మ పండుగ కోసం గ్రామస్తులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రాత్రిపూట ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. అలంకరణ కోసం ఏర్పాటుచేసిన విద్యుత్‌దీపాల వైర్లు తెగినట్లు సమాచారం. ఆ సమయంలో అక్కడే ఉన్న దేవేందర్, సునీల్, రవిపై తీగలు పడ్డాయి. తీగలు పడడంతో విద్యుదాఘాతానికి గురయి అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి గాయపడగా వెంటనే గ్రామస్తులు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని సమాచారం.

Also Read: Kalpana Soren: భర్తను తలచుకుని ప్రజల మధ్య కన్నీరు పెట్టుకున్న మాజీ సీఎం భార్య


కాగా సంఘటనపై పోలీసులకు సమాచారం అందిందని తెలిసింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. మృతదేహాలను కూడా ప్రభుత్వా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గ్రామస్తుల వివరాలు సేకరించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. ముగ్గురి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇక దుర్గమ్మ పూజ చేసుకోలేమని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రమాద వార్త తెలుసుకుని ఆయా రాజకీయ పార్టీల నాయకులు మృతుల కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి