Murder Cases In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత 15 రోజులుగా హత్య ఘటనలు పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆదివారం రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు అక్కాచెల్లెలను ముగ్గురు దుండగులు కాల్చి చంపగా.. డీయూ విద్యార్థిని పట్టపగలే కత్తితో పొడచి కిరాతకులు హత్య చేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్థిక వివాదాల నేపథ్యంలో..


నైరుతి ఢిల్లీలోని ఆర్‌కే పురం ప్రాంతంలో అక్కాచెల్లెలను ముగ్గురు దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడికి హత్యకు గురైన మహిళల సోదరుడితో ఆర్థిక వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున లలిత్ అనే వ్యక్తి ఇంటికి ముగ్గురు నిందితులు అరుణ్, మైఖేల్, దేవ్‌లు వచ్చి తలుపుకొట్టారు. అక్కడే నిద్రపోతున్న లలిత్ సోదరుడు లాల్ భయంతో అదే వీధిలో నివసిస్తున్న తన ఇద్దరు అక్కాచెల్లెలకు, బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్లు వచ్చేలోపు నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


అయితే కాసేపటికే వాళ్లు మళ్లీ పిస్టల్స్‌తో తిరిగి వచ్చి లలిత్‌ను లక్ష్యంగా కాల్పులు చేసేందుకు యత్నించారు. లలిత్‌ను రక్షించడానికి వెళ్లిన అక్కాచెల్లెలపై దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో జ్యోతి (29) అక్కడిక్కడే మృతి చెందగా.. మరో మహిళను ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు అరుణ్, మైఖేల్, దేవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న లలిత్ కోసం వెతుకుతున్నట్లు  నైరుతి ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మనోజ్ సి తెలిపారు.


అసభ్యంగా ప్రవర్తించాడని..


సౌత్ క్యాంపస్‌లోని ఆర్యభట్ట కళాశాల వెలుపల ఢిల్లీ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతుడిని పశ్చిమ విహార్‌కు చెందిన నిఖిల్ చౌహాన్ (19)గా గుర్తించారు. స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో బీఏ (ఆనర్స్) చదువుతున్న నిఖిల్.. స్నేహితురాలి పట్ల వారం రోజుల క్రితం కాలేజీలో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నిందితులు ఆర్యభట్ట కళాశాల వెలుపల నిఖిల్‌తో వాగ్వాదానికి దిగి ఛాతీపై కత్తితో పొడిచారు. 


నిఖిల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులను గుర్తించామని.. ఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. 


Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు  


Also Read: Adipurush Controversy: ఆదిపురుష్‌పై వివాదం.. దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook