Vijayawada Doctors Family: డాక్టర్‌ కుటుంబం మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఆర్థిక కష్టాలను తాళలేక తన తల్లి భార్యాపిల్లలను అత్యంత దారుణంగా కత్తితో హతమార్చి ఆపై ఆయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది. ఆస్పత్రి పెట్టి నష్టాలబారిన పడడమే ఈ ఘాతుకానికి కారణంగా తెలుస్తోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tragedy Incident: నలుగురి ప్రాణం తీసిన 'పుట్టినరోజు పార్టీ'.. చావులోనూ వీడని స్నేహం


విజయవాడలోని శ్రీజ ఆస్పత్రి యజమాని డాక్టర్‌ శ్రీనివాస్ (40). విజయవాడలోని గురునానక్ నగర్‌లో భార్య ఉషారాణి (36), పిల్లలు శైలజ (9), శ్రీహాన్(5)తోపాటు తల్లి రమణమ్మ (65)తో కలిసి శ్రీనివాస్‌ నివసిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలవాళ్లు గమనించగా.. ఇంటి ఆవరణలో శ్రీనివాస్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఇది చూసి వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: Tragedy Love: ప్రాణం తీసిన 'కులం' పంచాయితీ.. పంటపొలంలో ప్రేమ జంట ఆత్మహత్య


పోలీసులు రావడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా భార్య, పిల్లలు, తల్లి కూడా చనిపోయి ఉన్నారు. ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన స్థలానికి పోలీస్ కమిషనర్ రామకృష్ణ వచ్చి పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ కూడా విచారణ చేపట్టింది. ఆర్థిక నష్టాలు భరించలేక శ్రీనివాస్‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇవి తాళలేక అర్ద రాత్రి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను డాక్టర్‌ శ్రీనివాస్‌ అత్యంత క్రూరంగా హతమార్చాడు. అనంతరం తెల్లవారు జామున ఉరి వేసుకుని హత్య చేసుకున్నట్టు సమాచారం.


ఆర్ధిక ఇబ్బందులు కారణంగా  శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఈ వార్త విజయవాడలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబంతో సహా డాక్టర్‌ మృతి చెందడం కలకలం రేపింది. ఆస్పత్రి నిర్వహణలో నష్టాలు రావడంతో ఇటీవల దాన్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి.


వీరి మృతి వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి బోరున విలపించారు. బంధుమిత్రులు వచ్చి కుటుంబసభ్యులను ఓదార్చారు. అయితే శ్రీనివాస్‌పై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో అతడి స్నేహితులు వివరణ ఇచ్చారు. శ్రీనివాస్‌ మంచి వ్యక్తి అని చెప్పారు. 'శ్రీనివాస్‌ చాలా సౌమ్యుడు. ఎవరితో విబేధాలు లేవు. ఏడాది కిందట శ్రీజ ఆస్పత్రి ఏర్పాటుచేసి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఇలా చేసి ఉంటాడని అనుకుంటున్నాం' అని శ్రీనివాస్‌ స్నేహితులు వివరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter