Baby Mundan Ceremony: ఆంధ్రప్రదేశ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీ ఘోర ప్రమాదాన్ని మరువకముందే మరో ఘోర విషాద సంఘటన చోటుచేసుకుంది. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరిగి ఏడుగురు మృత్యువాతపడ్డారు. రెండు ప్రమాదాలతో రహదారి రక్తసిక్తమైంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షణాల్లో ప్రయాణం కాస్త విషాదంగా మారిపోవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాప పుట్టు వెంట్రుకలు తీసుకునేందుకు తిరుమల వెళ్తుండగా ఈ ఘోర సంఘటన జరిగింది. ఈ ప్రమాదాలు వైఎస్సార్‌ కడప జిల్లాలో చోటుచేసుకున్నాయి. వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Shocking Incident: వీళ్లు స్కూల్‌ పిల్లలా? వీధిరౌడీలా.. బాలికపై పిడిగుద్దుల వర్షం


కడప జిల్లా దువ్వూరు మండలం బయనపల్లిలో రాత్రిపూట ఐదుగురు ప్రయాణికులతో వెళ్తున్న కారు లారీ పరస్పరం ఢీకొన్నాయి. కడప - రాయచోటి జాతీయ రహదారిలో గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురితోపాటు లారీ డ్రైవర్‌తో సహా మొత్తం ఆరుగురు అక్కడకక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: King Cobra: ఆస్పత్రిలో 12 అడుగుల నల్ల నాగుపాము హల్‌చల్.. రోగులు, డాక్టర్ల పై ప్రాణాలు పైకే!


 


తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తమ పాప పుట్టు వెంటుక్రలు తీసేందుకు ఓ కుటుంబం సోమవారం తిరుపతి బయల్దేరింది. తుఫాన్‌ వాహనం మాట్లాడుకుని ఆనందంగా తిరుపతి బయల్దేరారు. కర్నూల్ నుంచి బయల్దేరిన కుటుంబం కొన్ని గంటల్లో తిరుపతి చేరుకుంటామనుకునే సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం ధాటికి వాహనం లోయలో పడిపోయిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పాప కూడా చనిపోయిందని సమాచారం. దీంతో ఆనందంగా వెళ్లిన వారు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆనందంగా తిరిగి వస్తారనుకుంటే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో బాధిత కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. చక్రాయపాలెం మండలం కొన్నేపల్లివాసులుగా తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter