Reels Stunts: ముందే వర్షాకాలం.. రోడ్లన్నీ తడితో ప్రమాదకరంగా తయారవుతాయి. ఎక్కడ గుంతలు.. రోడ్డు ధ్వంసమైందో తెలియదు. ఈ సమయంలో వర్షాకాలంలో స్పోర్ట్స్‌ బైక్‌పై రీల్స్‌ చేస్తే ఇక అంతే సంగతులు. కేటీఎం బైక్‌పై రీల్స్‌ చేస్తుండగా బైక్‌ అదుపు తప్పింది. బైక్‌ నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా.. వెనుకాల కూర్చున్న యువకుడు మాత్రం ప్రమాద ఘటనలోనే దుర్మరణం పాలయ్యాడు. దిగ్భ్రాంతికి గురి చేసే ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. చేతికొచ్చిన కొడుకు అకాల మృతితో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. తాను చనిపోతానంటూ ఆస్పత్రిలో రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఆ వీడియోలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tragic Incident: దిగ్భ్రాంతికర సంఘటన.. పిల్లల కోసం ఉరితో ఆటలాడుతూ తండ్రి దుర్మరణం


 


హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో శనివారం సాయంత్రం ఇద్దరు యువకులు కేటీఎం బైక్‌పై సంచరిస్తున్నారు. పెద్ద అంబర్‌పేట సమీపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కేటీఎం బైక్‌పై రీల్స్‌ చేస్తున్నారు. ప్రమాదకరమైన రీతిలో బైక్‌తో స్టంట్లు చేస్తున్నారు. వర్షం సమయంలో స్టంట్లు చేయడంతో బైక్‌ అదుపుతప్పింది. వెంటనే అదుపు తప్పి కిందపడ్డారు. అయితే వెనుకాల కూర్చున్న శివ అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.

Also Read: Telangana Police: అమ్మనా బూతులతో రెచ్చిపోతున్న తెలంగాణ పోలీసులు.. కేటీఆర్‌, నెటిజన్లు ఆగ్రహం


 


ఇక బైక్‌ను నడుపుతున్న యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనతో స్థానికుల ఫిర్యాదుతో అంబులెన్స్‌ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. బైక్ వెనుకాల కూర్చున్న శివ మృతి చెందడంతో అతడి తల్లి ఆస్పత్రికి వచ్చి రోదించింది. ఆస్పత్రి బయట, లోపల ఆమె గుండెలు బాదుకుంటూ ఏడవడం అందరినీ కన్నీళ్లు తెప్పించింది. అయితే బైక్‌ నడిపిన యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి