Assault On Student: వాడు నా ప్రైవేట్ పార్ట్స్ ఒత్తుతూ లైంగికంగా వేధించాడు.. కాలేజ్ స్టూడెంట్ ఫిర్యాదు
Assault On College Student: తన ప్రైవేట్ పార్ట్స్ నొక్కి తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ కాలేజ్ స్టూడెంట్ ట్విటర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఇది. చెన్నైలో జర్నలిజం విద్యను అభ్యసిస్తోన్న యువతి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది.
Assault On College Student: తన ప్రైవేట్ పార్ట్స్ నొక్కి తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ కాలేజ్ స్టూడెంట్ ట్విటర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఇది. చెన్నైలో జర్నలిజం విద్యను అభ్యసిస్తోన్న యువతి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు వెల్లడించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. తన ఫ్రెండుతో కలిసి సెమ్మాంచెరిలోని ఈస్ట్ కోస్ట్ మద్రాస్ రెస్టారెంట్ నుండి ఐబిస్ ఓఎంఆర్ హోటల్ కి వెళ్లేందుకు యువతి ఆటో రిక్షా బుక్ చేసుకున్నారు. ఓఎంఆర్ హోటల్ వద్ద తన గమ్యస్థానం చేరిన తర్వాత ఆటోలోంచి దిగిన తనను ఉబర్ ఆటో డ్రైవర్ సెల్వన్ తనను అసభ్యంగా తాకుతూ తన కుడి వక్షోజాన్ని ఒత్తాడంటూ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన యువతి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్‌ను ప్రతిఘటించిన యువతి.. హెల్ప్ హెల్ప్ అంటూ బిగ్గరగా అరవడంతో ఆటో డ్రైవర్ ఆటోను అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదే విషయమై పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. వెంటనే ఎవ్వరూ స్పందించలేదన్నారు. 30 నిమిషాల తర్వాత ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు పోలీసులు హోటల్‌కి వచ్చి ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు.
పోలీసు స్టేషన్‌లో లేడీ పోలీస్ ఆఫీసర్ లేనందున ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రేపు ఉదయం వరకు వేచి ఉండాల్సిందిగా సూచించారంటూ సదరు యువతి ఆరోజు తనకు ఎదురైన ఇబ్బందులను కూడా ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. తాను ఆటో బుక్ చేసుకున్న ఉబర్ యాప్ స్క్రీన్‌షాట్స్‌ని పోలీసులకు అందించారు. ఆటో ఫోటోలను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. యువతి ట్వీట్స్‌కి స్పందించిన తంబరం పోలీసు కమిషనర్.. సెమ్మాంచెరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామని.. నిందితుడైన ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నామని రిప్లై ఇచ్చారు.
Also Read : Hyderabad Gang-rape case: తెలంగాణలో మరో గ్యాంగ్ రేప్ ఘటన..మత్తు మందు ఇచ్చి దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి