Moradabad Accident News: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భగత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీఎం, వ్యాను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మరో 13 మందికి గాయాలపాలయ్యారు. దల్‌పట్‌పుర్‌-కోషిపుర్‌ నేషనల్ హైవేపై ఖైరక్‌హతా సమీపంలో పికప్ వ్యానులో వెళుతుండగా.. ఎదురుగా వేగంగా వచ్చి డీసీఎం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వివాహ వేడుకకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారని వెల్లడించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. మరో 13 మంది గాయపడగా.. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించామన్నారు. మృతదేహాలను ఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. 
 
ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. పికప్ వ్యానుపై డీసీఎం వెళ్లడంతో చాలా మంది అందులో ఇరుక్కుపోయారని తెలిపారు. అతికష్టం మీద బయటకు తీయాల్సి వచ్చిందన్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న స్థానికులు.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, స్థానికులు కలిసి క్షతగాత్రులను బయటకు తీసి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


మరో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి..


జలౌన్ జిల్లాలోని మాధవ్‌గఢ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న బస్సును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డుపక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఎస్పీ ఇరాజ్ రాజా మాట్లాడుతూ.. మండేలా గ్రామం నుంచి రాంపుర ప్రాంతంలోని దూతవలికి పెళ్లి ఊరేగింపు వచ్చిందని తెలిపారు. ప్రమాదం తర్వాత గాయపడిన వారందరినీ రాంపురలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించినట్లు చెప్పారు. మృతులను కుల్దీప్ (36), రఘునందన్ (46), సిరోభన్ (65), కరణ్ సింగ్ (34), వికాస్ (32)గా గుర్తించామని వెల్లడించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Also Read: Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా..


Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి