Uttar Pradesh News: ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయి తమ కుటుంబం పరువు తీసిందని ఓ యువకుడు తన చెల్లెలు దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె తలను తీసుకుని నేరుగా పోలీసుల ముందుకు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. బారాబంకి జిల్లాలోని ఫతేపూర్ ప్రాంతంలోని మిత్వారా గ్రామానికి చెందిన రియాజ్ (22), ఆసిఫా (18) అన్నాచెల్లెల్లు. ఆసిఫా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను వేరే మతస్థుడు కావడంతో వీరి పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో ఆ యువకుడితో కలిసి ఇంటి నుంచి ఆసిఫా పారిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఆసిఫా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రేమికుల కోసం గాలించారు. రెండు రోజుల తరువాత వారిద్దరిని గుర్తించారు. అనంతరం ఆసిఫాను వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. యువకుడిని అరెస్ట్ చేశారు. తన చెల్లెల్లు ఇంటి నుంచి పారిపోయి తమ కుటుంబం పరువు తీసిందని రియాజ్ కోపంతో రగిలిపోయాడు. 


చెల్లెల్లు ఆసిఫాతో శుక్రవారం గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. పదునైన ఆయుధంలో ఆమె గొంతు కోసం హత్య చేశాడు. అనంతరం మెడ నుంచి తలను వేరు చేశాడు. తలను తీసుకుని నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశుతోష్ మిశ్రా తెలిపారు.


కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించామని.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. తన సోదరి మరో మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని.. ఇది రియాజ్‌కు నచ్చలేదన్నారు. రియాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. 


Also Read: Special Train: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారి కోసం స్పెషల్ ట్రైన్స్  


Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook