UP Jhansi Medical College Fire Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో చిన్నారుల వార్డులో శుక్రవారం అర్ధరాత్రి హఠాత్తుగా మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీయగా.. స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వార్డు తలుపులు, కిటికీలు పగులగొట్టి 37 మంది చిన్నారులను బయటకు తీశారు. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 47 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.   
 
శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో మెడికల్ కాలేజీలో మంటలు చెలరేగినట్లు  ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బందికి ఏమీ అర్థంకాలేదు. ఈలోపు వార్డులో పొగలు అలుముకోవడంతో  వైద్య కళాశాల అగ్నిమాపక వ్యవస్థ సహాయం అందించేందుకు వీలు లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి పది మంది అభశుభం తెలియని శిశువులు సజీవ దహనమయ్యారు. తలుపులు, కిటికీలు పగలగొట్టి 37 మంది పిల్లలను ఎలాగోలా బయటకు తీశారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. మంటలు, పొగ పీల్చడంతో కొంతమంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన జరిగిన తరువాత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో సహా ఇతర వైద్యులు తమ ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసుపత్రి వార్డులో మంటలు ఎలా చెలరేగాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. విద్యుత్ ఓవర్‌ లోడింగ్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే వార్డులో సిలిండర్ పేలుడు జరిగిందని మరికొందరు వాదిస్తున్నారు. అగ్నిమాపక శాఖకు చెందిన ఫైర్ బ్రిగేడ్‌తో పాటు, ఆర్మీ ఫైర్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. డీఎం, ఎస్పీ సహా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. వార్డులో పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడింది.


ఈ ఘటనపై యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.


Also Read:  Smita Sabharwal: మహారాష్ట్రలో స్మిత సబర్వాల్.. అక్కడ కూడా మేడమ్ సర్.. మేడమ్ అంతే.. క్రేజ్ మాములుగా లేదుగా..


Also Read: Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter