UP Lesbian Love Story: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో ఓ విచిత్రమైన ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోగా.. అందులో ఓ యువతి ప్రేమ కోసం అబ్బాయిగా లింగమార్పిడి చేయించుకుంది. అయితే అబ్బాయిగా మారిన తరువాత.. ప్రియురాలు మోసం చేసింది. ఆమె మరో వ్యక్తి ప్రేమలో పడింది. దీంతో లింగమార్పిడి చేయించుకున్న అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఝాన్సీ ప్రాంతంలోని ప్రేమ్ నగర్‌లో 2016లో సనా అనే అమ్మాయి అద్దె ఇంట్లోకి దిగింది. ఈ క్రమంలో ఆ ఇంటి కూతురు సోనాల్ శ్రీవాస్తవతో స్నేహం ఏర్పడింది. ఈ ఫ్రెండ్‌షిప్ క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరు కలిసే జీవించాలని నిర్ణయించుకున్నారు. 2017లో వీరి ప్రేమ వ్యవహారం సోనాల్ ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవ జరిగింది. వెంటనే సనాను ఇళ్లు ఖాళీ చేసి పంపించారు.  


ఆ తరువాత కుటుంబంతో గొడవపడి సనాతో కలిసి జీవించేందుకు సోనాల్ ఇళ్లు విడిచి వెళ్లిపోయింది. 2017లోనే వీరిద్దరి కేసు పోలీస్ స్టేషన్‌కు చేరింది. అయితే రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. తర్వాత వీరిద్దరు లివ్ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉండటానికి ఇరు కుటుంబాల నుంచి అనుమతి లభించింది. అయితే సోనాల్ కోరిక మేరకు 2020లో సనా లింగ మార్పిడి చేయించుకుంది. ఆపరేషన్ కోసం రూ.12 లక్షలు వెచ్చించింది. సనా నుంచి సోహైల్‌గా మారాడు. 


అయితే అబ్బాయిగా మారినా.. శారీరక మార్పులు చోటు చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దాదాపు ఏడాది తరువాత బాడీ సెట్ అయింది. అయితే ఈలోపు సోనాల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆమె మరో వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుందామని సనా సోహైల్ అడగ్గా.. సోనాల్ నిరాకరించింది. దీంతో తనకు జరిగిన మోసం సోహైల్ పోలీసులును ఆశ్రయించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. సోనాల్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమె బెయిల్‌పై బయటకు రాగా.. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది. ప్రేమ కోసం అమ్మాయిగా ఉన్న సనా అబ్బాయిగా మారి.. చివరకు దారుణంగా మోసపోయారు.


Also Read: IND Vs NZ: టాస్ గెలిచిన టీమిండియా.. ఏం తీసుకోవాలో మర్చిపోయిన రోహిత్ శర్మ  


Also Read: Hyper Aadi: 2024లో జనసేన ప్రభుత్వం.. సినిమాటోగ్రఫీ మంత్రిగా హైపర్ ఆది.. పోస్టులు వైరల్!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook