Uttar Pradesh Crime News: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అజంగఢ్ జిల్లా బిలారియాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెళ్లి ఒప్పుకోలేదని ప్రియుడిని మాజీ ప్రేమికుడితో కలిసి హత్య చేసింది ఓ ప్రియురాలు. యువకుడి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీలో చిచోరి గ్రామానికి చెందిన 22 ఏళ్ల రామ్ అనే యువకుడు ఫిబ్రవరి 2న అదృశ్యమయ్యాడు. యువకుడు మిస్సింగ్‌పై బిలారియాగంజ్ పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ముబాకర్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాగాపూర్‌ గ్రామంలోని కాలువ ఒడ్డున గ్రామస్థులు మేకలు మేపుతుండగా.. ఆదివారం మట్టిలో పూడ్చిపెట్టిన మృతదేహం కనిపించింది. దీంతో వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం బిలారియాగంజ్‌లో కనిపించకుండా పోయిన రామ్‌గా గుర్తించారు. అనంతరం అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చి విచారణ చేపట్టారు. 


మృతుడు రామ్‌కు రుబీనా అనే యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు గుర్తించారు. ఆమెతో పెళ్లికి రామ్ ఒప్పులేదు. దీంతో రుబీనా తన మాజీ ప్రియుడు రవీంద్ర కుమార్‌కు విషయం చెప్పింది. ఇద్దరు కలిసి రామ్ హత్యకు ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం రామ్‌ను తీసుకుని రుబీనా ఊరి చివరకు వెళ్లింది. అనంతరం రవీంద్ర కూడా అక్కడికి చేరుకున్నారు.


పెళ్లి విషయంలో రామ్, రుబీనా మరోసారి గొడవపడ్డారు. ఇంతలో వెనుక నుంచి రామ్‌ను రవీంద్ర గడ్డపారతో కొట్టాడు. ఆ తర్వాత రుబీనా కూడా పలుమార్లు గడ్డపారతో రామ్‌పై దాడి చేసింది. దీంతో రామ్ మృతిచెందగా.. అనంతరం ఇద్దరూ పొలంలో గొయ్యి తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. హత్య అనంతరం ఎవరికి వాళ్లు వెళ్లిపోయారు. ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.


రుబీనాను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య చేసి పూడ్చినట్లు ఒప్పుకుంది. పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే హత్య చేసినట్లు విచారణలో చెప్పింది. హత్యకు సహకరించిన మాజీ ప్రియుడు రవీంద్ర కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన గడ్డపారను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.


Also Read: Pension Scheme: ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. డబుల్ బెనిఫిట్ ఉండేలా ప్లాన్..!  


Also Read: MLA Mekapati Chandrasekhar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook