Electrical Shock: పొరపాటున తీగకు విద్యుత్‌ ప్రవాహం జరిగి భార్యాభర్తలు మృతి చెందారు. బట్టలు ఉతికాక ఆరు బయట వేసిన తీగకు ఆరేసేందుకు రాగా భార్య ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలింది. వెంటనే భర్త వచ్చి ఆమెను కాపాడే ప్రయత్నం చేయగా అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని కొడంగల్‌ నియోజకవర్గం బొంరాస్‌పేటలో చోటుచేసుకుంది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Farmer: 'మెట్రో'లో రైతుకు ఘోర అవమానం.. 'మురికి బట్టలు' ఉన్నాయని రైలు ఎక్కనివ్వని సిబ్బంది


వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం బురాన్‌పూర్‌ గ్రామంలో బోయిన లక్ష్మణ్‌ (48), లక్ష్మి (42) భార్యాభర్తలు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి ముందు రేకుల షెడ్డు వద్ద దుస్తులు ఆరబెట్టేందుకు తీగ కట్టి ఉంచారు. సోమవార యథావిధిగా బట్టలు ఉతికిన లక్ష్మి ఆ తీగపై ఆరవేసేందుకు వెళ్లింది. అయితే ఆ తీగకు అప్పటికే విద్యుత్‌ ప్రసారం జరుగుతోంది. ఈ విషయం తెలియని ఆమె తీగను ముట్టడంతో విద్యుదాఘాతానికి గురైంది. ఇది చూసిన భర్త వెంటనే ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. అతడు కూడా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం ఏర్పడింది.

Also Read: Depression: యూట్యూబర్‌ షణ్ముఖ్‌ చనిపోవాలనుకున్నాడా? మానసిక వ్యధకు గురయ్యాడా?


ప్రమాదానికి కారణం..
అక్కడ కట్టి ఉంచిన తీగకు విద్యుత్‌ సరఫరా ఎలా జరిగిందనేది పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు పరిశీలించారు. విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మార్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా అధికారుల నిర్లక్ష్యమే వారిద్దరి ప్రాణాలు బలి తీసుకున్నాయని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. దంపతుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.

గ్రామంలో సమస్య
మృతుని అన్న రాంచంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఇదే రోజు ఇదిలా ఉండగా లక్ష్మణ్‌ దంపతుల అంత్యక్రియలకు హాజరైన బంధువు గడిసింగాపూర్‌ వెంకటమ్మ కూడా ఇదే ఇంట్లో విద్యుదాఘాతానికి గురవడం విస్తుగొలిపింది. గాయపడిన ఆమెను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ పరిణామాలతో గ్రామస్తులు విద్యుత్‌ అధికారులపై మండిపడుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని.. లేకపోతే మరిన్ని ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి