No Physical Relation With Husband: అత్తామామలు, కుటుంబసభ్యులతోపాటు భర్త వ్యవహారంపై ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. తనకు పెళ్లయి రెండేళ్లయ్యిందని.. ఇప్పటివరకు తన భర్తతో 'కార్యం' కాలేదని ఆరోపిస్తూ కేసు నమోదు చేయించింది. భర్త అత్తామామల తీరుతో తాను నరకం అనుభవిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఫిర్యాదులో ఆమె ఆసక్తికర విషయాలు పేర్కొంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Movie Chance Fraud: సినిమా ఛాన్స్‌ల పేరిట తన 'కోరికలు' తీర్చుకుని మోసం చేసిన నటుడు


బిహార్‌లోని వైశాలి జిల్లాలోని లాల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. 'మాకు 31 మే 2021లో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత అత్తగారింటికి వెళ్లా. పెళ్లయిన ఈ రెండేళ్లలో నా భర్తతో ఇప్పటివరకు ఎలాంటి లైంగిక అనుబంధం లేదు. ఈ విషయాన్ని అత్తామామలకు చెబితే ఎలాంటి ప్రయోజనం లేదు. అతడిని వదిలేసి పుట్టింటికి వెళ్తానంటే మాత్రం నా భర్త తీవ్రంగా హింసించడం.. కొట్టడం.. చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు' అని ఆ మహిళ వాపోయింది. గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా అత్తామామలు, భర్తకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: TS High Court: పోలీసులకు 'క్లాస్‌' తీసుకోవాలి.. డీజీపీకి తెలంగాణ హైకోర్టు సూచన


అత్తవారింటిని వదిలేసి పుట్టింటికి వెళ్తానంటే తరచూ వేధింపులకు గురి చేసేవారు. అటు పుట్టింటికి వెళ్లనీయక.. ఇంట్లో ప్రశాంతంగా ఉండనీయకుండా అత్తామామలు, భర్త వేధింపులకు గురి చేస్తున్నారని ఆ మహిళా వాపోయింది. విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే దాడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్లుగా అత్తింట్లో నరకం అనుభవిస్తున్నట్లు పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకుంది.


అయితే భర్త తనను ఎందుకు దూరం పెడుతున్నాడో తెలియదంటూ భార్య సందేహాలు వ్యక్తం చేస్తోంది. భర్త సంసారానికి పనికి రాడా? అనే అనుమానాలు లేవనెత్తింది. లైంగిక కార్యానికి భర్త పనికి రాడనే విషయాన్ని దాచి కుటుంబసభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. విడాకులు ఇవ్వకుండా.. సంసారం చేయకుండా వేధిస్తున్న అత్తామామలు, భర్తతోపాటు మరికొందరు కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. అసలు కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook