Killer Wife: కరెంట్ షాక్ పెట్టినా, కారుతో ఢీకొట్టినా బతికిపోయాడు.. మూడోసారి గన్ తో కాల్చేసింది.. ప్రియుడి మోజులో కిరాతకం
Killer Wife: మంచిర్యాల జిల్లా గోదావరి ఖనిలో యువకుడిని గన్ తో కాల్చి చంపిన కేసును పోలీసులు చేధించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే హంతకులను పట్టుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలో కలకలం స్పష్టించిన యువకుడు రాజేందర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.
Killer Wife: మంచిర్యాల జిల్లా గోదావరి ఖనిలో యువకుడిని గన్ తో కాల్చి చంపిన కేసును పోలీసులు చేధించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే హంతకులను పట్టుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలో కలకలం స్పష్టించిన యువకుడు రాజేందర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడిని కిష్టంపల్లిలో అరెస్ట్ చేసిన పోలీసులు.. కీలక విషయాలు కాబట్టారు. ప్రియుడి మోజులో భార్యే భర్తను అతి కిరాతకంగా హత్య చేసిందని పోలీసులు తేల్చారు. భర్తను హత్య చేసిన భార్యతో పాటు ఆమెకు సహకరించిన ప్రియుడు, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గోదావరి ఖని పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి. ప్రియుడి మోజులో పడిన నిందితురాలు.. గతంలో రెండు సార్లు భర్తను చంపేందుకు ప్రయత్నించి విఫలైమంది. ఓసారి భర్తను హత్య చేసేందుకు కరెంట్ షాక్ ఇచ్చింది. కాని ఆ ప్రమాదంతో అతను బయటపడ్డాడు. రెండోసారి రోడ్డుపై వెళుతుండగా కారుతో ఢీకొట్టి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే రెండోసారి కూడా రాజేందర్ సేఫ్ గా బయటపడ్డారు. రెండు సార్లు భర్తను హత్య చేయడంలో విఫలమైన కిల్లర్ భార్య.. మూడోసారి ఏకంగా గన్ తో కాల్చేసింది.
రాత్రి ఇంట్లో నిద్రపోతున్న భర్తను గన్ తో కణతపై కాల్చేసింది. దీంతో స్పాట్ లోనే రాజేందర్ చనిపోయాడు. భర్తను హత్య చేసే సమయంలో ఆమె ప్రియుడు, అతని స్నేహితుడు పక్కనే ఉన్నాడు. గన్ తో కాల్చేసిన భార్య.. తర్వాత కొత్త డ్రామా ఆడింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసి తన భర్తను చంపేశారని కట్టు కథ అల్లింది. భార్యను అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బయటికి వచ్చింది. భర్తను హత్య చేసేందుకు వాడిన తుపాకీ కొనేందుకు కూడా ప్రియుడికి రవళి డబ్బులు ఇచ్చిందని.. అవి కూడా భర్త బ్యాంక్ ఖాతా నుంచే బదిలీ చేసిందని పోలీసులు నిర్ధారించారు.
Also Read: Amit Shah Meets Jr Ntr: బిగ్ బ్రేకింగ్: అమిత్ షాను కలవనున్న జూనియర్ ఎన్టీఆర్..పొలిటికల్ రీ ఎంట్రీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook