Siddipet Woman Arest: ఆ మైనర్ బాలుడి వయసు 16. ఆ మహిళ వయసు 27. అద్దె కోసం తన భర్తతో ఆ ఇంటికి వచ్చిన మహిళ.. ఇంటి ఓనర్ కొడుకుపై కన్నేసింది. మాయమాటలతో ఆ బాలుడిని బుట్టలో వేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలుడితో బలవంతంగా శారీరంగా కలిసేది. చివరకు బాలుడితో ఎక్కడికైనా వెళ్లిపోవాలని ప్లాన్ వేసింది. బాలుడి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు తీసుకురమ్మని చెప్పి.. ఇద్దరు చెన్నైకు వెళ్లిపోయారు. అక్కడే రూమ్ తీసుకుని డబ్బులు అయిపోయేవరకు ఎంజాయ్ చేశారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో బాలుడిని తిరిగి ఇంటికి పంపించేసింది. బాలుడి తల్లి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేటలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను టూ టౌన్ ఇన్‌స్పెక్టర్  ఉపేందర్ వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ అనే వ్యక్తి తన భార్య (27), పిల్లలతో సిద్దిపేట పట్టణం హనుమాన్ నగర్‌లో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. గత మూడేళ్లుగా అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో విజయ్ భార్య ఆ ఇంటి యజమాని కొడుకు (16)తో పరిచయం పెంచుకుంది. మాయమాటలు చెప్పి శారీరంగా లోబర్చుకుంది. ఎవరులేని సమయంలో బాలుడితో బలవంతంగా కలిసేది. కొన్నిరోజులు గడిచిన తరువాత ఆ బాలుడితో ఎక్కడికైనా వెళ్లిపోవాలని ప్లాన్ వేసి.. అతన్ని బలవంతంగా ఒప్పించింది. బాలుడి ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం తెప్పించుకుంది. తన భర్త, పిల్లలను సిద్దిపేటలోనే క్కడనే వదిలేసి జనవరి 22న బాలుడిని తీసుకొని చెన్నై వెళ్లింది.


తన కుమారుడు కనిపించడం లేదని.. తన ఇంట్లో ఉన్న మహిళపై అనుమానం ఉందని బాలుడి తల్లి సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. టెక్నాలజీ ద్వారా నిందితురాలు, బాలుడు చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు. బాలుడిని చెన్నైకు తీసుకువెళ్లిన మహిళ.. అక్కడే ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుంది. బాలుడి వెంట తీసుకువెళ్లిన డబ్బులను జల్సాలకు ఖర్చు చేశారు. బంగారాన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేసి.. ఆ డబ్బులతో కూడా ఎంజాయ్ చేశారు. 


డబ్బులు అయిపోగా.. పోలీసులు ఎలాగైనా కనిపెడతారని భావించిన నిందితురాలు ఈ నెల 11న సిద్దిపేటలో వదిలేసింది. ఇంటికి చేరుకున్న బాలుడు.. జరిగిన విషయాన్ని మొత్తం తల్లికి చెప్పాడు. బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన తల్లి.. నిందితురాలి గురించి సమాచారం అందించింది. నిందితురాలను అరెస్ట్ చేసిన పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళను జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు.


Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం


Also Read: OMG Trailer: నవిస్తూ.. భయపెట్టేసిన 'ఓ మంచి ఘోస్ట్' ట్రైలర్.. ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లోయింగ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి