Delhi Girl: బ్రేకప్ చెప్పిందని లవర్‌పై యువకుడు కత్తితో దాడి.. వీడియో వైరల్
Girl Stabbed In Delhi: గర్ల్ ఫ్రెండ్ తనకు బ్రేకప్ చెప్పిందని అతను కక్ష పెంచుకున్నాడు. తనతోనే ఉండాలని ఆమెను పలుమార్లు అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఏకంగా కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించాడు. పూర్తి వివరాలు ఇలా..
Girl Stabbed In Delhi: లవర్ బ్రేక్ చెబితే ఎవరైనా ఏం చేస్తారు..? కొంతమంది దేవదాసులై పోతారు. మరికొందరు ఇక జీవితంలో ఎవరినీ ప్రేమించకూడదని ప్రేమకు దూరంగా ఉంటారు. ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి అంటూ ఇంకొందరు లైట్ తీసుకుంటారు. కానీ ఓ బాయ్ ఫ్రెండ్ మాత్రం అలా చేయలేదు. తనకు గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందని ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది.
ఈ సంఘటన జనవరి 2న ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో జరిగింది. పార్క్ ప్రాంతంలో నివసిస్తున్న యువతి ఏదో పని కోసం బయటకు వెళుతుండగా.. నిందితుడు సుఖ్వీందర్ సింగ్ ఎవరు లేని ప్రదేశంలో వీధిలో ముందు నుంచి వచ్చి ఒంటరిగా ఉన్న యువతిపై కత్తితో దాడికి దిగాడు. కత్తితో ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. యువతి మెడ, పొట్ట, చేతులపై పలుచోట్ల గాయాలయ్యాయి. గాయపడిన బాలికను బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సుఖ్వీందర్ సింగ్ కోసం గాలించారు. ఢిల్లీ నుంచి పారిపోయి అంబాలాకు చేరుకున్నట్లు గుర్తించారు. వెంటనే అంబాలాకు వెళ్లి నిఘా ఉంచిన పోలీస్ బృందం.. జనవరి 3న నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 307 హత్య ప్రయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తనకు బ్రేకప్ చెప్పడంతో కోపంతోనే కత్తితో దాడి చేసినట్లు నిందితుడు విచారణలో చెప్పినట్లు తెలిసింది.
“మా మధ్య స్నేహాన్ని కొనసాగించాలని అతను కోరుకున్నాడు. నేను అతనితో సంబంధంలో ఉండాలనుకోలేదు. మేము స్నేహితులం. కానీ కొన్ని సమస్యల కారణంగా నేను స్నేహాన్ని వద్దనుకున్నాను. అప్పటి నుంచి నాపై ఒత్తిడి పెంచాడు. జనవరి 2న అతను నన్ను కలిశాడు. ఫ్రెండ్‌షిప్ కొనసాగించమని మళ్లీ అడిగాడు. కానీ నేను నిరాకరించడంతో నన్ను కత్తితో పొడిచాడు” అని బాధిత యువతి పోలీసులకు తెలిపింది.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Also Read: అరుదైన రికార్డు సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. టీ20ల్లో తొలి కెప్టెన్‌గా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook