Hyderabad Crime: మా ఆత్మలకు శాంతి జరగాలంటే వాళ్లను శిక్షించాలి.. ప్రేమికుడి సూసైడ్ నోట్
Young Man Suicide in Medchal: మేడ్చల్ జిల్లాలో శ్రీహరి అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు రాసిన సూసైడ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతకుముందు అతని వేధింపుల కారణంగా బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
Young Man Suicide in Medchal: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాథమిక దర్యాప్తులో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై.. వేధింపులతో యువతి ఆత్మహత్యకు కారకుడైన శ్రీహరిగా గుర్తించారు. బీ ఫార్మసీ చదువుతున్న విద్యార్థి తేజస్విని మృతికి కారణమైన శ్రీహరి భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రి నుంచి పరారైన శ్రీహరి.. దుండిగల్ బహుదూర్‌పల్లి సాయినాథ్ సొసైటీలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే శ్రీహరి అదృశ్యంపై సూరారం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆత్మహత్యకు ముందు శ్రీహరి రాసుకున్న సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది.
Also Read: Visakhapatnam MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీకి లైన్ క్లియర్.. పోటీ నుంచి టీడీపీ అవుట్..!
"ఇది నా సూసైడ్ నోట్.. ప్లీజ్ మా ఇద్దరికి న్యాయం చేయండి. ముమ్మా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు లేకుండా అసలు అయితలే.. వచ్చేస్తున్నా నీ దగ్గరికి.. నా మధ్య లేని పోనివి అన్నీ వేస్తున్నారు. నేను చనిపోయాక అందరికి నిజం తెలుస్తుంది. రాజు రెడ్డి బీజేపీ లీడర్‌నే అనింటికి కారణం. తేజు వాళ్ల నాన్న నువ్వు ఏదో అనుకున్నావు. 7th కి మేము ఇద్దరం పెళ్లి చేసుకోవడానికి పోయినామ్. ఒక మాటలో చెప్పాలంటే.. తేజు లేనిదే శ్రీ లేడు. శ్రీ లేనిదే నేను లేను. మల్ల నాది వన్ సైడ్ లవ్ కాదు. ఒకరంటే ఓరికి ప్రాణం. ముమ్మా నీ దగ్గరికే వస్తున్నా..
సారీ మమ్మీ.. అక్క నువ్వే మమ్మీని చూసుకో.. తేజు, నేను చనిపోవడానికి కారణం మాత్రమే రాజు రెడ్డి, ఇంకా మీ నాన్న, మీ అన్న విలని. వీళ్లను అసలు వదలద్దు. మా ఇద్దరి ఆత్మలకు శాంతి కావాలంటే వాళ్లను కఠినంగా శిక్షించాలి. ముమ్మా నీ దగ్గరికి వచ్చేస్తున్నా.. నేను చనిపోయాక మన పిక్స్ బయటకు వస్తాయి. అప్పుడు మీడియా వాళ్లు హెల్ప్ చేయాలి. అందరూ దీని కోసం ఫైట్ చేయాలి. ఇదే నా ఆఖరి కోరిక. నా తేజు నా కోసం పైన వెయిట్ చేస్తోంది. నేను పోతున్నా.. అక్క నువ్వే అమ్మను అమ్మ మంచిగా చూసికో.. నేను లేని లోటు నువ్వే తీర్చాలి.." అంటూ రాసుకొచ్చాడు.
యువతి ఎలా చనిపోయింది..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలానికి చెందిన రాజు కూతురు తేజస్విని (20) బీఫార్మసీ చదువుతుండగా.. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దోమడుగు గ్రామానికి చెందిన శ్రీహరిలో పరిచయం ఏర్పడింది. ఐదు నెలలుగా ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. అయితే నెల రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని యువతిని వేధించాడు. దీంతో మనస్థాపం చెందిన యువతి తేజస్విని.. ఇంటి నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో శ్రీహరి కూడా భయంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే ఆసుపత్రి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలోనే శ్రీహరి ఇలా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తప్పు ఎక్కడ జరిగినా.. ఎవరు చేసినా.. ఇద్దరి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. అన్ని సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు. క్షణికావేషంలో తీసుకున్న నిర్ణయాలతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.