Hero Allu Arjun says Allu Studios did not set up to make money: దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అల్లు రామలింగయ్య శత దినోత్సవం సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌.. హైదరాబాద్‌లో నిర్మించిన 'అల్లు స్టూడియోస్‌' ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. దాదాపు 10 ఎకరాల్లో ఏర్పాటైన ఈ స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని స్టూడియోని ప్రారంభించారు. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన తాతయ్య అల్లు రామలింగయ్య విగ్రహానికి పూల మాలలు వేసి.. ఆయన గురించి మాట్లాడారు. 'ఈరోజు మా తాతయ్య అల్లు రామలింగయ్య గారి 100వ పుట్టినరోజు. ఇది మాకెంతో ప్రత్యేకం. మా నాన్న అల్లు అరవింద్‌ గారికి అగ్ర నిర్మాణ సంస్థ ఉంది. స్థలాలు కూడా బాగానే ఉంటాయి. ఈ స్టూడియో పెట్టడం పెద్ద సమస్య కాదని అందరూ అనుకొని ఉండొచ్చు. అయితే డబ్బు సంపాదించడం కోసం మేము ఈ స్టూడియో పెట్టలేదు. ఇది మా తాతయ్య కోరిక. ఆయన జ్ఞాపకార్థం ఈ స్టూడియోస్ నిర్మించాం' అని బన్నీ అన్నారు. 


'అల్లు స్టూడియోస్‌లో సినిమా షూటింగ్స్‌ బాగా జరగాలి. తెలుగు సినీ పరిశ్రమకు మంచి సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మా తాత గారు మరణించి 18 ఏళ్లు అయినా మా నాన్నకు ఇంకా ప్రేమ తగ్గలేదు. ఏళ్లు గడుస్తున్నా కొద్ది ప్రేమ పెరుగుతూ పోతుంది. ఫంక్షన్ సైజ్ కూడా పెరుగుతోంది. మా నాన్న.. వాళ్ల నాన్నను ఇంతలా ప్రేమించడం చూస్తుంటే చాలాచాలా ముచ్చటేస్తోంది. మా నాన్నకు ధన్యవాదాలు' అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నారు. 



అల్లు స్టూడియోస్‌ హైదరాబాద్‌ సిటీ అవుట్ స్కర్ట్స్‌లో ఉన్న కోకా పేట్‌లో భారీగా నిర్మించారు. 10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్‌ ఉంది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్టూడియోస్‌ను అల్లు  ఫామిలీ నిర్మించింది. అల్లు స్టూడియోస్‌లో పుష్ప 2 షూటింగ్‌ను చాలావరకు జరుపనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప సీక్వెల్‌కు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయట. 


Also Read: ఇదేందయ్యో ఇది నేను ఎప్పుడూ చూడలే.. అండర్‌వేర్‌ను మింగిన నాగుపాము! చివరకు


Also Read: విజయ్‌, నా గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.