18 Pages Trailer Review: కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో నిఖిల్ అదే ఊపుతో మరోసారి 18 పేజెస్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. కార్తికేయ-2 మూవీలో నిఖిల్ సరసన ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కూడా జంటగా నటించింది. పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా.. బన్ని వాస్, సుకుమార్ నిర్మించారు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేసిన 18 పేజెస్ మూవీ మూవీ డిసెంబర్ 23న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 పేజెస్ మూవీ విడుదలకు మరో వారం రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. 18 పేజెస్ మూవీ ట్రైలర్ చూస్తే.. స్మార్ట్ ఫోన్స్, ఫేస్‌బుక్ అంటూ ఫోన్లోంచి తలకాయ తీయని యువతే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అసలు ఫోన్ అనేదే ఉపయోగించకుండా, ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ అనేదే లేకుండా జీవితాన్ని గడిపేస్తోన్న ఒక అమ్మాయితో యూనిక్ లవ్ స్టోరీ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ఇది అని అర్థమవుతోంది. 


అదే సమయంలో హీరోయిన్ కిడ్నాప్ సీన్స్, ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన హీరోకు ఎదురైన సవాళ్లు, ఇతర అనేక యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచాయి. 18 పేజెస్ మూవీ ఫస్ట్ ఆఫ్ అంతా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తరహాలో... సెకండ్ హాఫ్ మొత్తం కథను ఉరుకులు, పరుగులు పెట్టించే విధంగా కథనం ఉంటుందా అనిపించేలా మూవీ ఉంటుందా అనిపించేలా ట్రైలర్ ఉంది. 

ఇటీవల కాలంలో నిఖిల్ సినిమాలకు క్రేజ్ పెరుగుతుండటం, నిఖిల్ చివరి చిత్రం కార్తికేయ-2 సూపర్ హిట్ అవడం వంటి పరిణామాలు ఇప్పటికే 18 పేజెస్ మూవీపై ఆసక్తిని పెంచాయి. అంతేకాకుండా తాజాగా రిలీజైన ట్రైలర్‌లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచి, క్యూరియాసిటీ లెవెల్స్ పెంచిన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి.