2018 Movie to become 1st pan India blockbuster of Mollywood: ఈ మధ్యకాలంలో సినిమాకి ఎల్లలు లేకుండా పోతున్నాయి. ఒక భాషలో తెరకెక్కిన సినిమా కనుక  బాగుంటే గతంలో ఇతర భాషల దర్శక నిర్మాతలు కర్చీఫ్ వేసి కొనుగోలు చేసి రీమేకులు చేసేవాళ్లు. ఇప్పటికీ ఆ ట్రెండ్ అలానే కొనసాగుతున్నా ఎక్కువగా ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాల డబ్బింగ్ రైట్స్ కొనుక్కుని తెలుగు సహా ఇతర భాషల్లో రిలీజ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యకాలంలో మలయాళంలో 2018 అనే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా మలయాళ మార్కెట్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచి దాదాపుగా 125 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సంపాదించింది .2018 సంవత్సరంలో కేరళలో వచ్చిన వరదలు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఆర్మీ అంటే భయపడి అక్కడ ఉద్యోగం మానేసి వెనక్కి పారిపోయి వచ్చిన వ్యక్తి ఆ వరదలలో ఊరు మొత్తాన్ని ఎలా కాపాడాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు.


Also Read: Bichagadu 2 Review: విజయ్ అంటోనీ బిచ్చగాడు 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?


ఇక ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలవడంతో ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమా రిలీజ్ చేసేందుకు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని మే 26వ తేదీన అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి తెలుగు సినీ పరిశ్రమ మొదలు హిందీ, కన్నడ, తమిళ సినీ పరిశ్రమల నుంచి రిలీజ్ అయి పాన్ ఇండియా లెవెల్ లో హిట్లుగా నిలిచిన సినిమాలు చాలా ఉన్నాయి.


కానీ ఇప్పటి వరకు మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి థియేటర్లలో ప్లాన్ ఇండియా హిట్టుగా నిలిచిన సినిమాలు లేవు. 2018 సినిమా కనుక ఇతర భాషల ప్రేక్షకులకు కూడా నచ్చితే అదే మొదటి మలయాళ పాన్ ఇండియా సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. 2018 సినిమాలో టోవినో థామస్ హీరోగా నటించగా ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివాడ, కలైయరసన్, అజు వర్గీస్, సిద్దిక్, జాయ్ మాథ్యూ, సుధేష్ వంటి వారు నటించారు. 


Also Read: Rashmika Vijay: దేవరకొండతో డేటింగ్ రూమర్స్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. అంతా సిగ్గే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook