65th Annual Grammy Awards:  2023 సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఎదురు చూస్తున్న మ్యూజిక్ అవార్డ్స్  ఈవెంట్ గ్రామీ అవార్డ్స్ భారతదేశంలో సోమవారం (ఫిబ్రవరి 6) ఉదయం ప్రసారం కానున్నాయి. 2023 గ్రామీలు USలోని CBSలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి అయితే ఈసారి అవార్డులు మరింత ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఎందుకంటే పాటల రచయిత, వీడియో గేమ్‌ల కోసం ఉత్తమ స్కోర్ సౌండ్‌ట్రాక్ సహా మరెన్నో అనేక కొత్త క్యాటగిరీలు కూడా ఈ అవార్డులకు జోడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాస్ ఏంజిల్స్‌లోని క్రిప్టో.కామ్ అరేనా నుండి ఆదివారం రాత్రి 8PM నుంచి 11.30PM వరకు అవార్డు షో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారాన్ని సోమవారం ఉదయం 6.30 నుండి 10 గంటల వరకు చూడవచ్చు అయితే అమెరికాలో మాత్రం CBS టెలివిజన్ నెట్‌వర్క్ మరియు పారామౌంట్+లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇక వీటిలో కాకుండా, ప్రజలు అధికారిక గ్రామీ వెబ్‌సైట్‌లో కూడా ఈ ప్రోగ్రామ్‌ను వీక్షించవచ్చు.


హాస్యనటుడు, మాజీ ది డైలీ షో హోస్ట్ ట్రెవర్ నోహ్ వరుసగా మూడవ సంవత్సరం గ్రామీ అవార్డుల ఈవెంట్ ను హోస్ట్ చేయనున్నారు. హ్యారీ స్టైల్స్, బాడ్ బన్నీ, మేరీ జె. బ్లిజ్, బ్రాండి కార్లైల్, ల్యూక్ కాంబ్స్, స్టీవ్ లాసీ, లిజో, కిమ్ పెట్రాస్ సహా సామ్ స్మిత్ వంటి కళాకారులు ఈ కార్యక్రమంలో తమ ప్రదర్శన సైతం ఇవ్వబోతున్నారు.  ఈ సంవత్సరం, బియాన్స్‌తో సహా అనేక సంగీత ప్రముఖులు ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీలో ఉన్నారు. హ్యారీ స్టైల్స్, మేరీ జె బ్లిజ్, కేండ్రిక్ లామర్, అబ్బా సహా లిజ్జో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్‌కు నామినీలుగా ఉన్నారు.


అదే సమయంలో, అడెలె ఈ పేర్లతో రికార్డ్ ఆఫ్ ది ఇయర్‌కు కూడా నామినేట్ అయ్యారు. ఈ ప్రోగ్రాం చూడాలి అనుకునేవారు live.grammy.com వంటి వెబ్‌సైట్‌లలో ప్రత్యక్షంగా వీక్షించగలరు. ఇక 65వ వార్షిక గ్రామీ అవార్డుల నామినేషన్లు నవంబర్ 15, 2022న ప్రకటించబడ్డాయి. అయితే ఈ జాబితాలో చాలా ఆశ్చర్యకరమైన నామినేషన్లు ఉన్నాయి. 11 సార్లు గ్రామీ విజేత టేలర్ స్విఫ్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్, విజువల్ మీడియా కోసం రాసిన ఉత్తమ పాట, బెస్ట్ కంట్రీ సాంగ్ మరియు బెస్ట్ మ్యూజిక్ వీడియోతో సహా నాలుగు నామినేషన్లను అందుకుంది.  


Also Read: Rashmika Mandanna : చాలా రోజులకు ఇంటికి వెళ్లిన రష్మిక.. అక్కడ చేసిన పనులివే


Also Read: Balakrishna Nurse Controversy: ఈసారి నర్సులను కెలికిన బాలయ్య.. దానమ్మ భలే అందంగా ఉందంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.