83 Trailer At Burj Khalifa: టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవిత కథ (Kapil Dev life story) ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83'. సినిమా (83 Movie release date) రిలీజ్ డేట్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్​ జోరుగా సాగుతున్నాయి.



ఈ సినిమా ప్రమోషన్స్​ను చిత్ర యూనిట్​ వినూత్నంగా చేస్తోంది. సినిమా తారాగనంతో పాటు, క్రికెట్​ దిగ్గజాలు కపిల్ దేవ్​, సనీల్​ గావస్కర్​లు  ప్రమోషన్​ కోసం ఇటీవల దుబాయ్ చేరుకున్నారు.


ఇందులో భాగంగా.. ఈ సినిమా ట్రైలర్​ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం.. బుర్జ్​ ఖలీఫాపై (83 Movie trailer at Burj Khalifa) ప్రదర్శించారు.


ఈ సినిమాలో కపిల్​ దేవ్​ పాత్ర పోషించిన రణ్​​వీర్​ సింగ్​, బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణె (Ranveer-Deepika), ఇతర చిత్ర యూనిట్​ సహా కపిల్​ దేవ్​, సునీల్ గావస్కర్​లు ఈ ట్రైలర్​ను బుర్జ్ ఖలీఫాపై వీక్షించి అనందించారు.


ఈ ట్రైలర్​ చూసి దీపికా పదుకొణె భావోద్వేగానికి (Deepika Padukone Gets Emotional
) లోనయ్యారు. వందలాది మంది బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్​ చూసిన ఓ వీడియోను రణ్​​వీర్​ సింగ్ తన ఇన్​స్టా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీజువల్స్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో హల్​ చల్ చేస్తున్నాయి.


83 సినిమా గురించి..


1983 భారత్ ప్రపంచకప్​ను ముద్దాడిన క్షణాలు మన దేశం ఎప్పటికి మరిచిపోలేనివి. ఆ సమయంలో టీమ్ ఇండియా సారథిగా ఉన్న కపిల్ దేవ్​ జీవితం అధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతో వచ్చింది.


ఎట్టకేలకు ఈ నెల 24న సినిమాను విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. ఇందుకోసం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదలవనుంది. త్రీడీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. క్రికెట్ నేపథ్యంతో సాగే సినిమా కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.


ఈ సినిమాలో రణ్​వీర్​ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్​ త్రిపాఠి, తమిళ నటుడు జీవా సహా పెద్ద సంఖ్యలో నటినటులు ఉన్నారు.


తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్​పై అక్కినేని నాగార్జున విడుదల చేయనున్నారు.


Also read: RRR Pre Release : ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు అంతా రెడీ.. హోస్ట్‌గా బాలీవుడ్‌ మెగాస్టార్‌?


Also read: Pushpa Day 1 Collection: అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook