Aadi Sai Kumar-Top Gear : వరుస సినిమాలతో ఆది సాయి కుమార్ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా.. తన వంతుగా ఆడియెన్స్‌ను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో ఆది ఫుల్ బిజీగా మారాడు. ఈ మధ్య తీస్ మార్ ఖాన్ అంటూ అందరి ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇందులో ఆది మరింత స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆది టాప్ గేర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారనుందట.


ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందట. ఈ మేరకు మేకర్లు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది.  ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కెరీర్‌కి టాప్ గేర్ పడినట్లే అని ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, త్రీడీ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అప్ డేట్స్ చూసి టాప్ గేర్‌కి యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. మోషన్  పోస్టర్‌లో ఆది సాయి కుమార్ యాక్షన్ మోడ్‌తో ఆకట్టుకున్నాడు. తొలిసారిగా త్రీడీ వర్షన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది టాప్ గేర్ చిత్ర యూనిట్.  


ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఓ వైవిద్యభరితమైన కథతో రూపొందించనున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా, ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయని, త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో  బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్  తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Also Read : పల్లకిలో సింగర్ మంగ్లీ.. వీడియో వైరల్


Also Read : ఆచార్య విషయంలో అదే బాధ.. అందుకే రాజమౌళి సినిమాలో నటించను : చిరంజీవి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి