Aadi Sai Kumar Top Gear : అది రీమేక్ చేయాలని ఉంది.. మనసులోని కోరికను బయటపెట్టేసిన ఆది సాయికుమార్
Aadi Sai Kumar Top Gear ఆది సాయి కుమార్ తాజాగా టాప్ గేర్ కోసం మీడియా ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో సినిమా గురించి విషయాలను చెబుతూనే తన మనసులోని కోరికలు కూడా బయటకు చెప్పేశాడు. అంతఃపురం సినిమాలోని అసలేం గుర్తుకు రాదు అనే పాటను రీమేక్ చేయాలనుందట.
Remaking Anthapuram Songs ఆది సాయి కుమార్ ఈ ఏడాది ఆల్రెడీ రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అనే సినిమాలతో మెప్పించాడు. ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాబోతోన్నీ చిత్రాన్ని డిసెంబర్ 30న రిలీజ్ చేయబోతోన్నారు.
ఈక్రమంలో ఆది మీడియాతో ముచ్చటించాడు. తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో క్యాబ్ డ్రైవర్‌గా నటించానని, అతని జీవితంలో తనది కాని చిక్కుల్లో పడతాడని, ఒక రోజులోనే ఈ కథ జరుగుతుందని, ఆ చిక్కుల్లోంచి అతను ఎలా బయటపడతాడు అనేది కథ అంటూ రివీల్ చేశాడు. ఇది పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ కాదని అన్నాడు.
ఈ చిత్రంలో తనకు, హీరోయిన్‌కు తక్కువ సీన్లుంటాయని, రియా సుమన్ చాలా చక్కగా నటించిందని, ఆమె ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉందని అన్నాడు. కెమెరామెన్ అద్భుతంగా సినిమాను తీశాడని, చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగా వచ్చాయని అన్నాడు. ఫైట్ మాస్టర్ ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్స్ చేశాడని, ఫైట్స్‌లోనూ కథ చెప్పాలని ప్రయత్నించాడట.
ఇక హర్షవర్దన్ ఆర్ఆర్ మాత్రం ఇంకో స్థాయిలో ఉంటుందట. టాప్ గేర్ సినిమా టెక్నికల్‌గా అద్భుతంగా ఉంటుందని ఆది తెలిపాడు. ఇప్పుడు మాస్ సినిమాలకు మీనింగ్ మారిందని, కేజీయఫ్ వచ్చి అర్థం మార్చేసిందని, చేస్తే అలాంటి మాస్ సినిమా చేయాలని ఉందని ఆది అన్నాడు. ఇక తన తండ్రి సినిమాలు, పాటలను రీమేక్ చేయాలని ఉందట. అంతఃపురంలోని అసలేం గుర్తుకు రాదు అనే పాటను రీమేక్ చేయాలని ఉందట. కానీ సరైన సిట్యువేషన్ రావాలని, ఒకవేళ రీమేక్ చేయాల్సి వస్తే.. దాన్ని మళ్లీ కృష్ణవంశీయే డైరెక్ట్ చేయాలని అన్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook