AAGMC First Look: సుధీర్ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. బెంచ్‌మార్క్ స్టూడియోస్‌ బ్యానర్‌ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడీ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సరికొత్త ప్రేమ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్‌ను మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమాకు నిర్మాణసంస్థగా పనిచేస్తున్న బెంచ్ మార్క్ స్టూడియోస్ తో కలిసి పనిచేసేందుకు బిగ్ ప్రొడక్షన్ హౌస్ ముందుకొచ్చింది.


ప్రముఖ నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారని ఇటీవలే చిత్రబృందం అధికారికంగా ప్రకటన కూడా చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ తమతో జాయిన్ అవ్వడం పట్ల 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేశారు. 


గతంలోని తన చిత్రాల్లో హీరోయిన్ రోల్ కు ప్రాముఖ్యం ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ.. ఈ సినిమాలోనూ కృతిశెట్టిని చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై గాజుల‌ప‌ల్లి సుధీర్ బాబు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి.మ‌హేంద్రబాబు, కిర‌ణ్ బ‌ల్లప‌ల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


వివేక్ సాగ‌ర్ సంగీతం సమకూరుస్తుండగా.. పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాహి సురేష్‌‌, ఎడిట‌ర్‌గా మార్తాండ్ కె. వెంక‌టేష్ పనిచేస్తున్నారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, క‌ళ్యాణీ న‌ట‌రాజ‌న్‌ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. 


Also Read: Radhe Shyam Release Date: రాధేశ్యామ్ మూవీ రిలీజ్ వాయిదాపై మేకర్స్ క్లారిటీ!


Also Read: RRR Postponed: ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఒమిక్రాన్ ధాటికి రిలీజ్ వాయిదా 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి