Imran Khan ReEntry: ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో కొన్నాళ్లు సూపర్‌ హిట్‌ సినిమాలు చేశాడు. విలాసవంతమైన జీవితం అనుభవించాడు. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా జీవితం తిరగబడింది. సరైన సినిమాలు రాక ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో అతడు వెంటనే పరిశ్రమకు దూరమై కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు. ఈ సమయంలో కుటుంబ పోషణ కోసం తన కారును అమ్ముకున్న పరిస్థితులు వచ్చాయి. అతడు ఎవరో కాదు బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్‌ ఖాన్‌.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Dog Biscuit: ఇదేం 'కుక్క బిస్కెట్‌ పంచాయితీ' అయ్య? సరికొత్త వివాదంలో రాహుల్‌ గాంధీ


బాల నటుడిగా నటించిన ఇమ్రాన్‌ ఖాన్‌ 2008లో 'జానే తూ య జానేనా' అనే సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేశాడు. అనంతరం భారీ హిట్ సినిమాలు చేశాడు. కత్రినా కైఫ్‌, కరీనా కపూర్‌, దీపికా పదుకుణె, కంగనా రనౌత్‌ వంటి స్టార్‌ హీరోయిన్లతో నటించాడు. 'మేరి బ్రదర్‌ కీ దుల్హాన్‌', 'ఏక్‌ మైన్‌ ఔర్‌ ఏక్‌ తూ', 'ఢిల్లీ బెల్లీ, గోరీ తేరే ప్యార్‌ మే' వంటి విజయవంతమైన సినిమాలు చేశాడు. హీరోగా కొనసాగుతున్న సమయంలో విలాసవంతమైన జీవితం అనుభవించాడు. లగ్జరీ ఇంట్లో ఉంటూ పెద్ద పెద్ద కార్లతో రాజభోగాలు అనుభవించాడు. అయితే కొన్నాళ్లకు ఇమ్రాన్‌ ఖాన్‌ జీవితం మారిపోయింది. తర్వాతర్వాత చేసిన సినిమాలు విజయవంతం కాకపోవడంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. 

Also Read: Cockroach Vande Bharat Train: భోజనంలో బొద్దింక.. 'వందే భారత్‌' ప్రయాణికుడికి విస్తుగొల్పే ఘటన


ఈ పరిస్థితులతో వెంటనే పరిశ్రమ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం ముంబైలోని లగ్జరీ ఇల్లును వదిలేసి బయటకు వచ్చాడు. ముంబైలోని చిన్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగాడు. అనంతరం భార్యా పిల్లలతో హాయిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే కుటుంబ పోషణ కోసం తన లగ్జరీ కారు 'ఫెరారీ'ని అమ్మేశాడు. ఈ వార్త సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. తన సినిమా జీవితంపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'కంగనాతో చేసిన కట్టి బట్టీ సినిమా ఫెయిల్‌తో తర్వాత నాకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు. కానీ అప్పటికే నేను ఆర్థికంగా స్థిరపడ్డా. అందుకే ఇప్పుడు ఆర్థిక పరిస్థితిపై ఆందోళన లేదు. నేను ఇప్పుడు తండ్రిని అయ్యా. ఈ సమయం నాకు చాలా విలువైనది. నా కూతురు ఇమారా కోసం నేను సమయం కేటాయించాలని భావిస్తున్నా. ఇకపై నటుడుగా కొనసాగడం నా పని కాదని అనుకుంటున్నా. నన్ను నేను సరిదిద్దుకోవాల్సి సమయం వచ్చింది. నా బిడ్డ, నా కుటుంబంతో సంతోషంగా ఉండాలనుకుంటున్నా' అని తెలిపాడు.


కుటుంబ పోషణ కోసం ఫెరారీ కారును అమ్మేయడంతో ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ వోక్స్‌ వాగన్‌ కారును వినియోగిస్తున్నాడు. అయితే మరోసారి హీరోగా నటించేందుకు ఇమ్రాన్‌ ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. సినిమాలకు దూరమైన తొమ్మిదేళ్ల తర్వాత ఆయన పరిశ్రమలోకి వస్తే మంచి కెరీర్‌ ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల సినిమా నటీనటుల రీఎంట్రీ విజయవంతమవుతోంది. అలాగే రీ ఎంట్రీ ఇస్తే మళ్లీ ఇమ్రాన్‌ ఖాన్‌కు పాత రోజులు తిరిగి వస్తాయని బాలీవుడ్‌ వర్గాల టాక్‌.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook