Aaradugula Bullet trailer: ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్
ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ వీక్షిస్తే.. గోపీచంద్ (Gopichand) లాంటి ఆరడుగుల బుల్లెట్‌ని హీరోగా పెట్టి బి గోపాల్ మరోసారి మాంచి మాస్ ఎంటర్‌టైనర్ తెరకెక్కించాడనే అనిపిస్తోంది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, జయప్రకాశ్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
Aaradugula Bullet Trailer: గోపీచంద్, నయనతార జంటగా నటించిన సినిమా ఆరడుగుల బుల్లెట్. దసరా పండగ రేసులో నిలిచిన ఈ సినిమా అంతకంటే ఓ వారం రోజులు ముందుగానే.. అంటే అక్టోబర్ 8న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర వంటి ఫ్యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైన బి గోపాల్ (Director B Gopal) డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జయ బాలాజీ రియల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తాండ్ర రమేష్ నిర్మించాడు. అక్టోబర్ 8న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ వీక్షిస్తే.. గోపీచంద్ (Gopichand) లాంటి ఆరడుగుల బుల్లెట్‌ని హీరోగా పెట్టి బి గోపాల్ మరోసారి మాంచి మాస్ ఎంటర్‌టైనర్ తెరకెక్కించాడనే అనిపిస్తోంది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, జయప్రకాశ్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఆరడుగుల బుల్లెట్ మూవీకి (Aaradugula bullet) ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ కథ అందించాడు. మణి శర్మ మ్యూజిక్ అందించాడు.
Also read : Samantha's father: సమంత, చైతూ డైవర్స్‌పై స్పందించిన ఆమె తండ్రి జోసెఫ్
మరో నాలుగు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ సినిమాపై ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ (Aaradugula Bullet Trailer) అంచనాలు పెంచింది. మరి అంచనాలకు తగినట్టుగా ఆరడుగుల బుల్లెట్ మూవీ ఉందో లేదో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.
Also read : Hero Ram Pothineni Injured: గాయపడ్డ హీరో 'రామ్ పోతీనేని'...'రాపో19' షూటింగ్ కు బ్రేక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook