Aarti Ravi Jayam Ravi: భార్యాభర్తలుగా తాము విడిపోతున్నట్లు సినీ నటుడు జయం రవి ప్రకటించగా.. లేదు తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన ఇచ్చారని అతడి భార్య ఆర్తి బాంబ్‌ పేల్చింది. విడాకుల ప్రకటన ప్రకటించారని తెలిసి తాను, తన పిల్లలు దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. తాను ఇంకా అతడితో కలిసి ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Devara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోత


 


18 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు.. తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఈనెల 9వ తేదీన జయం రవి ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు రోజుల తర్వాత అతడి భార్య ఆర్తి స్పందించారు. ఈ సందర్భంగా తన సామాజిక మాధ్యమాల్లో ఒక లేఖను పంచుకున్నారు. ఆ లేఖలో విడాకుల అంశంపై కీలక విషయాలు పంచుకున్నారు. 'నాకు తెలియకుండా.. నా అనుమతి తీసుకోకుండా విడాకుల విషయమై బహిరంగ ప్రకటన చేశారు. ఈ విషయం నేను దిగ్భ్రాంతికి గురయ్యా. ఎంతో బాధపడ్డా. 18 ఏళ్లుగా మేం కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం బాధించింది' అని లేఖలో ఆర్తి తెలిపారు.

Also Read: Jr NTR: ఎన్టీఆర్ వేసుకున్న షూ ఖరీదు తెలిస్తే ఫ్యూజులు ఔట్..!


 


జయం రవితో కలిసి ఉండాలని భావిస్తున్నట్లు లేఖలో ఆర్తి పేర్కొన్నారు. 'కొంతకాలం మా ఇద్దరి వచ్చిన విభేదాలను పరిష్కరించుకుని.. జీవితం కొనసాగించాలని ఎన్నో సార్లు ప్రయత్నం చేశా. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అయితే దురదృష్టం కొద్ది నాకు ఆ అవకాశం లభించలేదు. విడాకుల ప్రకటనతో నేను, నా పిల్లలు షాక్‌కు గురయ్యాం. ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం' అని ఆర్తి పేర్కొన్నారు.


'విడాకులతో మాకు ఏమాత్రం మేలు చేయదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని అనుకుంటున్నా. అందుకే బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. అన్యాయంపై నాపై నిందలు వేసి.. నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం మాకు కష్టంగా ఉంది. ఒక తల్లిగా.. నా తొలి ప్రాధాన్యం నా పిల్లల శ్రేయస్సే. విడాకులు వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుందని విశ్వసిస్తున్నా. ఇన్నాళ్లు మాకు మద్దతు ఇచ్చిన మీడియా, అభిమానులకు ధన్యవాదాలు. మీ ప్రేమే బలం.. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా' అని ఆర్తి ముగించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా.. కామెంట్ చేయకుండా హైడ్‌ చేయడం గమనార్హం.


వీరిద్దరి విడాకుల విషయం కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కొన్ని నెలల కిందట ఆర్తి జయం రవితో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో నుంచి డిలీట్‌ చేసింది. అప్పటి నుంచి వీరిద్దరి విడాకుల అంశం తెగ చర్చ జరుగుతుండగా.. మొన్నటి ప్రకటనతో వారి వివాహ జీవితానికి శుభం కార్డు పడింది. అయితే జయం రవి, ఆర్తి దంపతులకు ఆరావ్‌, అయాన్‌ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.